భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

Bhadrachalamనవతెలంగాణ – హైదరాబాద్
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరిగింది. 43 అడుగులకు వరద నీరు చేరుకుంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక అధికారులు జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి  వరద మధ్యాహ్నం ఒంటి గంటకు 42 అడుగులకు చేరినట్లు జిల్లా కలెక్టర్ ప్రియాంక తెలిపారు. గోదావరి నుంచి దిగువకు 8 లక్షల 89 వేల 911 వందల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ముంపుకు గురయ్యే ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. గోదావరికి వస్తున్న వరద వల్ల మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నదని చెప్పారు. ప్రజలు యంత్రాంగపు సలహాలు, సూచనలు పాటించాలని చెప్పారు. అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో భద్రాచలం టౌన్‌లోకి లీకేజీ వాటర్ పెద్ద ఎత్తున వస్తుంది. దీంతో రామయ్య ఆలయం చుట్టూ పరిసర ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరింది. దీంతో సింగరేణి నుంచి తెప్పించిన హై పవర్ మోటార్ల సహాయంతో నీటిని రివర్స్‌గా మళ్లీ గోదావరిలో పంపించే ప్రయత్నం చేస్తున్నారు.