పిచ్చికుక్కల స్వైర విహారం..ఐదుగురిపై దాడి

నవతెలంగాణ-మద్నూర్

కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ఆదివారం పిచ్చికుక్కలు స్వైర విహారం చేశాయి. ఐదుగురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. దీంతో గ్రామ ప్రజల్లో పిచ్చి కుక్కల స్వైర విహారం పట్ల ఆందోళన వ్యక్తం అవుతుంది. మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో కుక్కల బెడద అధికమైందని ప్రజలకు కుక్కలు బెడద నుండి హాని జరిగే విధంగా ఉన్నాయని పలుమార్లు పత్రికల్లో వార్తలు ప్రచురుతమైనప్పటికీ పంచాయతీ పాలకవర్గం గానీ పంచాయతీ అధికారులు గానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతుండగానే ఆదివారం నాడు పిచ్చి కుక్కలు స్వైర విహారం చేసి ఐదుగురు వ్యక్తులకు దాడి చేశాయి. పిచ్చికుక్కల దాడితో గ్రామ ప్రజలు మరింతగా ఆందోళన చెందుతున్నారు. ఇంటి బయట వెళ్లాలంటే కుక్కల బెడదతో భయం భయంగా ప్రజలు జంకుతున్నారు. పిచ్చి కుక్కలు బెడద నుండి గ్రామ ప్రజలకు కాపాడాలని గ్రామపంచాయతీ పాలకవర్గం పంచాయతీ అధికారులు నివారణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు.
Spread the love