MUST SEE: This is the start of I-395N rampage. Truck got on at 110N. Hit vehicles before Boundary Channel. Plowed into at least 5 before the bridge. Driver ran off. Will show you the stolen ambulance chase shortly. @ARLnowDOTcom @MetrorailSafety @TomJackmanWP #395rampage pic.twitter.com/dQyewlLcRW
— Dave Statter (@STATter911) August 12, 2023
నవతెలంగాణ – వాషింగ్టన్: అమెరికాలో అంబులెన్స్‌ను ఎత్తుకెళ్లిన ఓ దుండగుడు వర్జీనియా రాష్ట్రంలో బీభత్సం సృష్టించాడు. రోడ్డుపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ దాదాపు 13 కార్లను ఢీకొట్టాడు. నిందితుడిని క్లాడ్వెల్గా గుర్తించారు. అమెరికా జాతీయ హైవేపై దొంగలించిన అంబులెన్స్‌తో ఇష్టంవచ్చినట్లుగా దూసుకెళ్లాడు. తొలుత ఓ ట్రక్కును దొంగలించిన దుండగడు మరో వాహనాన్ని ఢీకొట్టాడు. ఆ సమయంలో పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో అతను మరో వాహనాన్ని హైజాక్ చేశాడు. ఆ తర్వాత పోలీసుల ఛేజింగ్ నుంచి తప్పించుకునేందుకు మళ్లీ అంబులెన్స్‌ను ఎత్తుకెళ్లాడు. ఆ అంబులెన్స్‌తో లేన్లు అన్నీ దాటుకుంటూ హంగామా చేశాడు. పోలీసులు నిందితుడిని అదపులోకి తీసుకున్నారు. జరిగిన ఘటన పట్ల దర్యాప్తు ప్రారంభించారు. 14వ స్ట్రీట్ బ్రిడ్జ్ ఏరియాలో ఉన్న ప్రధాన రోడ్లను మూసివేశారు. ఉన్మాది క్లాడ్వెల్ ఎత్తుకెళ్లిన అంబులెన్స్.. అంబులెన్స్‌తో చాలా వేగంగా దూసుకెళ్లిన అతను క్షణాల్లో లేన్లు మారుస్తూ పోలీసులకు చిక్కలేదు. ముందు వెళ్తున్న కార్లను వెనక్కి నుంచి ఢీకొట్టేశాడు. కనీసం అరడజను మంది గాయాలతో బాధపడ్డారు.