నేడు గ్రూప్‌-4 పరీక్ష…

నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలో 8,180 గ్రూప్‌-4 సర్వీసుల ఉద్యోగాల భర్తీకి ఈ రోజు రాతపరీక్ష నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షకు 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి వరకు 8.81 లక్షల మంది వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ పరీక్ష కోసం టీఎస్‌పీఎస్సీ రాష్ట్రవ్యాప్తంగా 2,878 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఫొటోగుర్తింపు కార్డు తప్పనిసరి తీసుకెళ్లాలని స్పష్టం చేసింది. పరీక్ష కేంద్రాలుగా గుర్తించిన పాఠశాలలకు పాఠశాల విద్యాశాఖ సెలవు ప్రకటించింది.

Spread the love