అన్నదానం నిర్వహించిన ఇమ్మడి గోపి..

నవతెలంగాణ -డిచ్ పల్లి
దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం ఇందల్ వాయి మండలంలోని నల్లవెల్లి గ్రామంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి దర్పల్లి మాజీ ఎంపీపీ, ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇమ్మడి గోపి పాల్గొని అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు.గత కోన్ని రోజుల క్రితం దుర్గామాత దేవి భక్తులు అన్నదానం నిర్వహించాలని కోరగా సిద్దమయ్యారు. అన్నదాననికి అయ్యే ఖర్చును బారించడనికి ముందుకు వచ్చినట్లు నల్లవెల్లి దుర్గామాత దేవి భక్తులు  తెలిపారు.అంతకు ముందు  నల్లవెల్లి గ్రామంలో నేలకోల్పిన దుర్గా మాత ను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గా దేవి భక్తులు అన్నదాన విషయమై ఇమ్మడి గోపి దృష్టికి తీసుకొని వచ్చిన వెంటనే కాదనకుండా అన్నదానం కు అయ్యే ఖర్చును బారిస్తానని హామీ ఇచ్చి నేరవేర్చడంతో అన్నదాన కార్యక్రమానికి గ్రామంలో చిన్న పెద్ద తేడా లేకుండా పేద్ద సంఖ్యలో పాల్గొన్నారు.బక్తులు, గ్రామస్తులు ఇమ్మడి గోపి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.అనంతరం ఇమ్మడి గోపి ని ఘనంగా సన్మానించారు.ఇమ్మడి గోపి చేస్తున్న సేవలు మర్చి పోలేనివని రాబోవు రోజుల్లో ఇంకా మరెన్నో సేవ కార్యక్రమాలు చేయాలని, మంచి నాయకుడుగా ఎదగాలని తమంత కోరుతున్నట్లు గ్రామస్తులు, బక్తులు పేర్కొన్నారు.

Spread the love