– పాత ఇండ్లలో ఉండొద్దు
– కరెంట్ స్తంభాలు, సాటర్లు ముట్టుకోవద్దు
– పిల్లలు బయటికెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి
– రైతులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి
– అనుకోని ఘటన జరిగితే అధికారులకు సమాచారమివ్వాలి
నవతెలంగాణ-యాచారం
గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం పాఠకులకు విధితమే. అయితే వరుసగా కురుస్తున్న వర్షాలపై అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండా లని కోరుతున్నారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఉన్న శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఎవరు కూడా ఉండవద్దన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, విద్యార్థులు బయటికి వెళ్లే సమయంలో కరెంటు స్తంభాలను ముట్టుకోకుండా తల్లిదండ్రులు వారిని అప్రమత్తం చేయాలని సూచిస్తున్నారు. కురుస్తున్న వర్షాలతో రోడ్డుమీద వాటర్ నిలిచే అవకాశం ఉన్నందున నడిచేటప్పుడు గుంతలు, మ్యానువల్స్‌ను చూసుకుని నడవాలని కోరుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పాఠశాలలకు రెండు రోజులపాటు సెలవులు ప్రకటించింది. ఇంటికాడ ఉండే చిన్నపిల్లలు, విద్యార్థులు కుంటలు, చెరువుల దగ్గరికి వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. ముఖ్యంగా రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లే సమ యంలో విద్యుత్ సాటర్లను అసలే ముట్టు కోవద్దని, వాటికి దూరంగా ఉండాలి. మనం అజాగ్ర త్తగా ఉంటే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో ఊహించలేమని అధికారులు తెలియజేస్తున్నారు. కురిసే వర్షాలతో ఎవరు ఎటువంటి ప్రమాదానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరు తున్నారు. ప్రజలంతా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి.
శిథిóలావస్థ ఇండ్లలో ఉండొద్దు
ఎడతెరిపి లేకుండా కురు స్తున్న వర్షాలతో అప్ర మత్తంగా ఉండాలి. గ్రామా ల్లో ఉన్న శిథిలా వస్థ ఇండ్లలో ఎట్టి పరిస్థితిల్లో ఉండొద్దు. ముఖ్యంగా చిన్న పిల్లలు, విద్యార్థులు విద్యుత్ స్తంభా లను ముట్టు కోకుం డా అవగాహన కల్పించాలి. పొలాల దగ్గరికి వెళ్లే రైతులు కరెంటు సాటర్లను ముట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదం జరగకముందే జాగ్రత్త పడాలి. ఎక్కడైనా అనుకోని ఘటనలు జరుగుతే అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలి. పిల్లలు కుంటలు, చెరువుల దగ్గరకి వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి.
తాసిల్దార్ సుచరిత యాచారం మండలం