శ్రీవారి హుండీకి పెరిగిన ఆదాయం..

నవతెలంగాణ – తిరుమల : తిరుమలలో భక్తుల సంఖ్య పెరగడంతో స్వామివారి హుండీ ఆదాయం పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 79,087 మంది భక్తులు దర్శించుకోగా 35,640 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.41కోట్లు వచ్చిందని వివరించారు.

Spread the love