విండీస్‌ పర్యటనకు భారత్ టెస్టులు, వన్డేలు జట్ల ప్రకటన

నవతెలంగాణ- ముంబాయి: వెస్టిండీస్‌ పర్యటనకు భారత్‌ స్క్వాడ్‌లను బీసీసీఐ ప్రకటించింది. జులై 12 నుంచి విండీస్ పర్యటన ప్రారంభమవుతుంది. రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు జరుగుతాయి. అయితే, రోహిత్‌ శర్మ నాయకత్వంలోనే భారత్‌ టెస్టులతోపాటు వన్డేలు ఆడనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో నిరాశపరిచిన ఛెతేశ్వర్‌ పుజారాను తప్పించి యశస్వి జైస్వాల్‌, రుతురాజ్‌ను ఎంపిక చేశారు. ఇద్దరు వికెట్ కీపర్లుగా కేఎస్ భరత్, ఇషాన్‌ కిషన్‌ను తీసుకున్నారు. సీనియర్‌ బౌలర్ మహ్మద్ షమీకి విశ్రాంతి ఇవ్వడం గమనార్హం. యువ బౌలర్‌ నవ్‌దీప్‌ సైనిని టెస్టుల్లోకి తీసుకున్నారు.  చాలా రోజుల తర్వాత ఉమ్రాన్‌ మాలిక్‌ను వన్డేల కోసం బీసీసీఐ ఎంపిక చేసింది. సంజూశాంసన్‌తోపాటు ఇషాన్‌ కిషన్‌ను వికెట్‌ కీపర్లుగా తీసుకుంది. హార్దిక్‌ పాండ్యకు వైస్‌ కెప్టెన్‌ బాధ్యతలను అప్పగించింది. మరో యువ బౌలర్‌ ముకేశ్‌ కుమార్‌కూ అవకాశం ఇచ్చింది. వన్డే ప్రపంచకప్‌ నేపథ్యంలో యువ క్రికెటర్లకు ఎక్కువ అవకాశాలు ఇచ్చేందుకు సెలెక్టర్లు మొగ్గు చూపారు. ప్రస్తుతం టెస్టులు, వన్డే సిరీస్‌లకు మాత్రమే బీసీసీఐ జట్లను ఎంపిక చేసింది.
భారత జట్లు:
టెస్టులు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్, రుతురాజ్‌ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, అజింక్య రహానె (వైస్‌ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), ఆర్‌ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, సిరాజ్, ముకేశ్‌ కుమార్‌, జయ్‌దేవ్ ఉనద్కత్, నవ్‌దీప్‌సైని
వన్డేలు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్, రుతురాజ్‌ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్‌ కిషన్‌ (వికెట్ కీపర్), హార్దిక్‌ పాండ్య (వైస్‌ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్, జయ్‌దేవ్ ఉనద్కత్, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్‌ కుమార్‌