జమ్మూ-శ్రీనగర్ మార్గంలో లోయలో పడిన బస్సు…8మంది మృతి

నవతెలంగాణ – శ్రీనగర్: జమ్మూకశ్మీరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు మరణించారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి వద్ద కత్రా వెళుతున్న బస్సు లోయలో పడటంతో 8 మంది మృతి చెందారు. ఈ ఘటనలో మరో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఝజ్జర్ కోట్లి సమీపంలో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. బస్సు అమృత్‌సర్ నుంచి కత్రా వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. సోమవారం రాజస్థాన్‌లోని జుంజును జిల్లాలో ట్రాక్టర్ ట్రాలీ లోయలో పడిన ఒక రోజు తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మహిళలు, ఇద్దరు మైనర్లు సహా ఎనిమిది మంది మృతి చెందారు. మానస మాతా ఆలయంలో జరిగిన మతపరమైన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ఆలయానికి దాదాపు ఒక కిలోమీటరు దూరంలో జరిగింది.ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఎవరైనా ప్రాణాలతో బయటపడే అవకాశం ఉందని అధికారులు సెర్చ్ ఆపరేషన్ సాగిస్తున్నారు. రాష్ట్ర మంత్రి రాజేంద్ర సింగ్ గూడా వెంటనే ఉదయపూర్వతిలోని సిహెచ్‌సికి వచ్చి ప్రమాదం గురించి ఆరా తీశారు.

Spread the love