నేటి నుంచి జూనియర్ కాలేజీలు ప్రారంభం

నవతెలంగాణ – హైదరాబాద్
రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్‌ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌. తెలుగు రాష్ట్రాల్లోని జూనియర్ ఇంటర్ కాలేజీలకు నిన్నటితో వేసవి సెలవులు ముగియనున్నాయి. ఇక ఇవాళ్టి నుంచి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి.
ఏపీలో జూన్ 14 వరకు మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుంది. తెలంగాణ ఏపీలో 2023-24 విద్యా సంవత్సరంలో 227 రోజులు ఇంటర్ కాలేజీలు నడవనున్నాయి. ఈ తరుణంలోనే.. విద్యార్థులు కాలేజీలకు రావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Spread the love