స్నేహితుల దినోత్సవం రోజున విషాదం…

నవతెలంగాణ – అమరావతి: స్నేహితుల దినోత్సవం రోజున ఏపీలో విషాదం చోటు చేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన స్నేహితులు ప్రయాణిస్తున్న కారు కాలువలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు జిల్లాలోని రామచంద్ర ఇంజినీరింగ్‌ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న 10 మంది విద్యార్థులు రెండు కార్లలో అల్లూరి జిల్లాలోని గుడిసే పర్యాటక కేంద్రానికి వెళ్లివస్తుండగా శనివారం అర్ధరాత్ని తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుపూడి వద్ద కారు పాత, కొత్త కాలువల మధ్య నుంచి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఉదయ్‌కిరణ్‌, హర్షవర్ధన్‌, హేమంత్‌ అనే విద్యార్థులు చనిపోగా మరో ముగ్గురు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love