సాహితీ వార్తలు

తెలంగాణ మహిళా కథల పోటీలు
బహుళ అంతర్జాల అంతర్జాతీయ త్రైమాసిక స్త్రీవాద పత్రిక, తెలుగు తల్లి కెనడా మాసపత్రిక, హెచ్‌ ఆర్‌ సి లిటరరీ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది సందర్భంగా తెలంగాణ మహిళా కథల పోటీలు నిర్వహించనున్నారు. ప్రథమ, ద్వితీయ, తతీయ బహుమతులుగా రూ.5000/-, రూ.4000/-, రూ.3000/-లతో పాటు రూ. 1000/- చొప్పున ఐదు ప్రత్యేక బహుమతులకు ఇవ్వనున్నారు. తెలంగాణ చరిత్ర, సంస్కతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా అంశాన్ని ఎంచుకుని ఏడు పేజీ లు మించకుండా యూనికోడ్‌ లేదా వర్డ్‌ డాక్యుమెంట్‌లో ఆగస్టు 30లోగా telanganamahilakathalu@gmail.com మెయిల్‌కు పంపవచ్చు. వివరాలకు 7995820736 నంబరు నందు సంప్రదించవచ్చు.
బండికల్లు ఫౌండేషన్‌ కథల పోటీ
బండికల్లు వెంకటేశ్వర్లు ఫౌండేషన్‌ ‘విశాఖ సంస్కతి’ తెలుగు మాసపత్రిక సౌజన్యంతో జాతీయ స్థాయి కథల పోటీ నిర్వహిస్తోంది. ఆరు కథలకు ఒక్కింటికి రూ.2000/- చొప్పున బహుమతి అందించనున్నారు. కథల్లో కుటుంబ వ్యవస్థ, నైతికవిలువలు, సామాజిక అంశాలు ప్రతిబిం బించాలి. ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 24 లోగా బండికల్లు జమదగ్ని, అధ్యక్షులు, బండికల్లు వెంకటేశ్వర్లు ఫౌండేషన్‌, 402, హిమజ టవర్స్‌, 3/10, బ్రాడీపేట, గుంటూరు – 522002 చిరునామాకు పంపవచ్చు. వివరాలకు 9848264742 నంబరు నందు సంప్రదించవచ్చు.
‘నెచ్చెలి’ కథా, కవితా పురస్కార ఫలితాలు
‘నెచ్చెలి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘శ్రీమతి కె.వరలక్ష్మి ఉత్తమ కథా పురస్కారం’ ఫలితాలు వెలువరించారు. ప్రథమ, ద్వితీయ, తతీయ బహుమతులకు బ్రిస్బేన్‌ శారద -ధీర, ఝాన్సీ కొప్పిశెట్టి-వాడని నీడలు, భాగవతుల భారతి -గంట గడిస్తే చాలు తో పాటు బి.కళాగోపాల్‌, జొన్నలగడ్డ రామలక్ష్మిల కథలు ప్రత్యేక బహుమతులకు ఎంపికయ్యాయి.
‘డా.కె.గీత ఉత్తమ కవితా పురస్కారం’ లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా పెనుగొండ బసవేశ్వర్‌ – ఇరాము లేని ఈగురం, దుద్దుంపూడి అనసూయ – జ్ఞాపకాల ఊడలు, అవధానం అమతవల్లి – అధిగమిస్తూ.. అంబరాన్ని చుంబిస్తూ లు ఎంపికయ్యాయి. వీటితో పాటు సుంక ధరణి, జి. రంగబాబు, డా.కటుకోఝ్వల రమేష్‌, చొక్కర తాతారావు కవితలు ప్రత్యేక బహుమతులుగా ఎంపికయ్యాయి.
ఏనుగు నరసింహారెడ్డికి సినారె సాహితీ పురస్కారం
‘ఊహాల వేదిక’ ఆవిష్కరణ
డా|| సి. నారాయణరెడ్డి 92వ జయంతి సందర్భంగా సజన భారతి సాహిత్య సాంస్కతిక సంస్థ డా|| ఏనుగు నరసింహారెడ్డి రచించిన ‘ఊహల వేదిక’ ఆధునిక కవిత్వ విమర్శ ఆవిష్కరణతో పాటు సినారె సాహితీ పురస్కారాన్ని ఆయనకు అందజేస్తోంది. ఈ నెల 23న ఆదివారం సాయంత్రం 6 గం||లకు తెలంగాణ సారస్వత పరిషత్తులో ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ సభలో డా|| కె.వి.రమణ, డా|| ఎల్లూరి శివారెడ్డి, డా|| నందిని సిధారెడ్డి, డా|| ఎం.కె. రాము, డా|| సి. మణాళిని, డా|| టి. గౌరీశంకర్‌, డా|| నాళేశ్వరం శంకరం తదితరులు పాల్గొంటారు.
– డా|| కొమ్మూరి ప్రసాద్‌, వ్యవస్థాపక అధ్యక్షులు, సజనభారతి