దుల్కర్ సల్మాన్, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రానికి ‘లక్కీ భాస్కర్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ‘నమ్మశక్యం కాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ మనిషి కథ’గా ఈ చిత్రం తెరకెక్కుతోందని, సినిమా ప్రేమికులకు థియేటర్‌లలో గొప్ప అనుభూతిని కలిగించే చిత్రమవుతుందని టైటిల్ ప్రకటన సందర్భంగా చిత్ర నిర్మాతలు తెలిపారు.
ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి, సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్: వినీష్ బంగ్లాన్, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య.