ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిసిన మున్సిపల్ కమిషనర్ మంద మకారంద్ 

నవతెలంగాణ- కంటేశ్వర్
నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ గా నియమితులైన మంద మకారంద్ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల గురువారం వారి నివాసంలో మర్యాపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ.. నిజామాబాద్ నగరంలో ఎలాంటి సమస్యలు ఉన్న తక్షణమే ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఎలాంటి సహకారం కావాలన్నా తాను కూడా అందుబాటులో ఉండి తీర్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
Spread the love