జూన్‌ 1న బాసర త్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌

5 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
 సమర్పణకు తుది గడువు 19 :
ఆర్జీయూకేటీ బాసర వీసీ వెంకటరమణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం (ఆర్జీయూకేటీ) బాసర త్రిపుల్‌ఐటీలో 2023-24 విద్యాసంవత్సరంలో ఆరేండ్ల సమీకృత బీటెక్‌ కోర్సులో ప్రవేశాల కోసం వచ్చేనెల ఒకటో తేదీన నోటిఫికేషన్‌ విడుదల కానుంది. బుధవారం హైదరాబాద్‌లో ఆర్జీయూకేటీ ఉపకులపతి (వీసీ) వి వెంకటరమణ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వచ్చేనెల ఐదో తేదీ నుంచి ప్రారంభమవుతుందని వివరిం చారు. వాటి సమర్పణకు తుదిగడువు అదేనెల 19 వరకు ఉందని చెప్పారు. పోస్టు ద్వారా దరఖాస్తుల సమర్పణకు తుది గడువు ఈనెల 19 వరకు ఉందన్నారు. వికలాంగులు, సీఏపీ, ఎన్‌సీసీ, క్రీడాకారులకు దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు జూన్‌ 24 వరకు ఉందని అన్నారు. ప్రొవిజినల్‌ సీట్ల ఎంపిక జాబితాను అదేనెల 26న ప్రకటిస్తామని వివరించారు. జులై ఒకటో తేదీన మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియలో భాగంగా రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు ఫీజు ఓసీ, బీసీలకు రూ.500, ఎస్సీ, ఎస్టీలకు రూ.450, ఇతర రాష్ట్రాలు, అంతర్జాతీయ విద్యార్థులకు రూ.1,500, ఎన్‌ఆర్‌ఐ విద్యార్థులకు వంద డాలర్లు చెల్లించాలని చెప్పారు. ఆర్డికల్‌ 371-డీ ప్రకారం 85 శాతం సీట్లు తెలంగాణ స్థానిక విద్యార్థులకు, 15 శాతం సీట్లు అన్‌ రిజర్వుడు (ఏపీ, తెలంగాణ) విద్యార్థులకు మెరిట్‌ ఆధారంగా కేటాయిస్తామని వివరించారు. పదో తరగతి గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌ (జీపీఏ), ప్రతి సబ్జెక్టులోనూ అభ్యర్థి పొందిన గ్రేడ్‌ ప్రతిభల ఆధారంగా, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ను అనుసరించి ప్రవేశాలను చేపడతామని అన్నారు. గురుకులాల యేతర, ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన దరఖాస్తులకు జీపీఏకు అదనంగా 0.4 డిప్రైవేషన్‌ స్కోరును కలుపుతామని వివరించారు. వచ్చే ఏడాది 1,650 సీట్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ ఏడాది జూన్‌ ఒకటి నాటికి 18 ఏండ్లు నిండని వారే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని స్పష్టం చేశారు. ఎస్సీ,ఎస్టీలకు మూడేండ్లు మినహాయింపు ఉంటుం దని వివరించారు. ఈ ఏడాది ఎస్టీ రిజర్వేషన్‌ పెరిగి నందున వారు ఎక్కువ మంది ప్రవేశాలు పొందే అవకాశముందన్నారు. త్రిపుల్‌ఐటీ బాసర ప్రాంగ ణంలో హెల్ప్‌లైన్‌ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పా రు. సందేహాలను విద్యార్థు లు నివృత్తి చేసుకోవచ్చని అన్నారు. ఇతర వివరాలకు షషష.తీస్త్రబస్‌.aష.ఱఅ, షషష. aసఎఱరరఱశీఅర. తీస్త్రబస్‌.aష.ఱఅ వెబ్‌సైట్ల ను సంప్రదించాలని సూచించారు.
అక్షయపాత్రకు భోజనం టెండర్‌!
త్రిపుల్‌ఐటీ బాసర ప్రాంగణంలో ఇంటిగ్రేటెడ్‌ మోడ్రన్‌ కిచెన్‌ నిర్మిస్తామని వెంకటరమణ చెప్పారు. జూన్‌ ఒకటో తేదీన టెండర్లు తెరుస్తామని అన్నారు. తొమ్మిది వేల మందికి ఒకేసారి భోజనం అందిస్తా మని వివరించారు. భోజనం అందించే టెండర్‌ను అక్షయపాత్రకు ఇవ్వాలనే ఉద్దేశంతో సంప్రదించా మని చెప్పారు. ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. నాన్‌వెజ్‌ కోసం స్థానిక మహిళా సంఘాల వారు శనివారం వచ్చి ఆదివారం నాన్‌వెజ్‌ వండి విద్యార్థుల కు అందించేలా ప్రణాళిక రూపొందించామని అన్నారు. అమెరికాలో ఎన్‌ఆర్‌ఐలతో శనివారం రాత్రి ఎనిమిది నుంచి 11 గంటల వరకు తరగతులు తీసుకుంటారని వివరించారు. ఈ ఏడాది అకడమిక్‌ అంశాలపై దృష్టిసారిస్తామని చెప్పారు. లెట్‌ షేర్‌ పేరుతో అమ్మాయిలు ఈమెయిల్‌ ద్వారా మానసిక, ఆరోగ్య, ఇతర సమస్యలను చెప్తే వారికి వైద్యుల ద్వారా కౌన్సిలింగ్‌ అందిస్తామని అన్నారు. విద్యార్థు లందరికీ హెల్త్‌కార్డులు తయారవుతున్నాయని వివరించారు. నిర్మల్‌ జిల్లాలో ఉన్నందున ఎన్‌ హబ్‌ (ఇంకుబేటర్‌ సెంటర్‌) పెడుతున్నామని చెప్పారు. నిజామాబాద్‌ ఐటీ టవర్‌లో త్రిపుల్‌ఐటీ బాసర ప్రాంగణానికి అవకాశం కల్పించారని అన్నారు. 65 శాతం కంటే ఎక్కువగా అమ్మాయిలు ఉన్నందున వారికి అకామిడేషన్‌పై దృష్టిసారిస్తామని చెప్పారు. వారికోసం వాక్‌ టు వాక్‌ ఐటీ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

Spread the love