ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు

నవతెలంగాణ-అశ్వారావుపేట
నట సార్వభౌమ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలు ఆదివారం తెలుగుదేశం నియోజక వర్గం ఇంచార్జి కట్రం స్వామి దొర నేతృత్వం అశ్వారావుపేట లోను నిర్వహించారు. కాగా పూర్వం టీడీపీలో పని చేసిన ప్రస్తుత బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లోని ఎన్‌టీఆర్‌ సామాజిక వర్గం నాయకులు హాజరు కావడం గమనార్హం. అయితే టీడీపీ నుండి ఇతర పార్టీలకు వెళ్ళిన నాయకులు గతంలో ఎన్టీఆర్‌ జయంతి, వర్ధంతికి పాల్గొన్న దాఖలాలు లేవు. కానీ శతజయంతి ఉత్సవాలు పేరుతో ఆ సామాజిక వర్గం ఒక్కటవ్వడం హర్షించతగ్గా విషయం. మూడు రోడ్ల కూడలిలో గల ఆయన విగ్రహానికి పూర్వ టీడీపీ నాయకులు, ప్రస్తుత కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు సుంకవల్లి వీరభద్రరావు, ప్రస్తుత బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షులు బండి పుల్లారావు, కమ్మ సంఘం అశ్వారావుపేట మండల అధ్యక్షులు సంకురాత్రి సతీష్‌ తదితరులు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు మాట్లాడుతూ కళా, రాజకీయ రంగాల్లో ఆయన అందించిన సేవలను కొనియాడారు. అనంతరం కమ్మ సంఘం ఆధ్వర్యంలో 300 మందికి పులిహౌర, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పేరాయిగూడెం సర్పంచ్‌ నార్లపాటి సుమతి, తలసిల ప్రసాద్‌, ఆండ్ర ప్రసాద్‌, తలసిల బాలక్రిష్ణ, కాకర్ల వెంకటేశ్వరరావు, నెక్కంటి ప్రసాద్‌, అల్లూరి బుజ్జి, తాడేపల్లి రవి, అరేపల్లి సాంబశివరావు, నార్లపాటి రాములు, రామకృష్ణ, నర్రా రాకేష్‌, తదితరులు పాల్గొన్నారు.
చండ్రుగొండ : నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా మండలం సెంటర్‌ నందు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలవేసి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ జెండాను మండల నాయకులు బెల్లంకొండ పరమేశ్వర ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్నత శిఖరానికి ఎదిగి తమ నటనలో తనదైన గుర్తింపు సాదించుకుని ఎన్ని వైవిద్యమైన పత్రాలు పోషించి, విలక్షణమైన నటుడిగా, రాజకీయ నాయకుడిగా, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన ఎన్టీఆర్‌ అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఎన్టీఆర్‌ అందరికీ నచ్చే అరుదైన వ్యక్తి అని కీర్తించారు. వారి శతాబ్ది ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం తెలుగు ప్రజలకు గర్వకారణమని, తెలుగు వారికి ఎన్టీఆర్‌ చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల నాయకులు చాపల మడుగు వెంకటేశ్వర్లు దడగల మల్లేష్‌, శ్రీనివాస్‌ రెడ్డి, లాల్‌అమ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు మణుగూరు పట్టణంలో అంబేద్కర్‌ సెంటర్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్‌ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు మణుగూరు కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శత జయంతి వేడుకలకు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, బ్లడ్‌ బ్యాంకును, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంబేద్కర్‌ సెంటర్‌ నుండి బస్టాండ్‌ వరకు మరలా అంబేద్కర్‌ సెంటర్‌ వరకు భారీ మోటార్‌ సైకిల్‌ ర్యాలీ ఎన్టీఆర్‌ చిత్రపటంతో ఊరేగింపు నిర్వహించారు. సీపీఐ(ఎం), సీపీఐ, తెలుగుదేశం, కాంగ్రెస్‌, వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ఆ మహనీయునికి నివాళులర్పించారు.
దుమ్ముగూడెం : మండల తెలుగుదేశం పార్టీ ఆద్వర్యంలో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. లకీëనగరం టిడిపి దిమ్మె వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం దుమ్ముగూడెం ప్రాదమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పాలు, పండ్లు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన కీర్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అద్యక్షులు కోమరం దామోదర్‌రావు, కల్లూరి ప్రసాద్‌, కొర్సా లక్ష్మయ్య, సోంది వీరస్వామి, భాస్కరాచారి, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
పినపాక : పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహౌన్నత వ్యక్తి ఎన్టీఆర్‌ అని టీడీపీ సీనియర్‌ నాయకులు వట్టం నారాయణ, మండల అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామంలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద టిడిపి మండల ప్రధాన కార్యదర్శి ధర్మరాజుల శంకర్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా టిడిపి మండల అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు కేక్‌ కట్‌ చేయగా, టిడిపి సీనియర్‌ నాయకులు వట్టం నారాయణ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ నాయకులు చందా మధు మాట్లాడుతూ తెలుగు భాషకు, తెలుగు రాష్ట్రాలకు ఒక గుర్తింపును తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్‌ అంటూ కొనియాడారు. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా అందరి హృదయాలు గెలుచుకున్న నాయకుడు ఎన్టీఆర్‌ అన్నారు. సీఎం అయిన తర్వాత పెత్తందారీ విధానమైన పటేల్‌, పట్వారీ వ్యవస్థను రద్దు చేశారని గుర్తు చేశారు. రెండు రూపాయల కిలో బియ్యం పథకంతో పేదల గుండెల్లో నిలిచారన్నారు. రాముడు, శ్రీకృష్ణుడు గురించి ఎవరన్నా మాట్లాడితే ముందు గుర్తుకు వచ్చే పేరు ఎన్టీఆర్‌ అన్నారు. ఎన్టీఆర్‌ సినీ, రాజకీయ ప్రస్థానం గురించి పలువురు మాట్లాడారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని టిడిపి నాయ కులు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకురాలు పసునూరి సీతమ్మ, సమితి సింగారం సర్పంచ్‌ భారతి, మేదరమెట్ల శ్రీనివాసరావు, కూచిపూడి బాబు, 250 మంది పైగా టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.
ములకలపల్లి : ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు మండలంలో ఆదివారం ఘనంగా జరిగాయి. టీడీపీ మండల అబ్జర్వర్‌ తేళ్ల చెన్నయ్య ఆధ్వర్యంలో ముందుగా ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్‌ తెలుగువాడిగా పుట్టడం తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. ప్రపంచపటంలో తెలుగువారికి గుర్తింపు తెచ్చిన నాయకుడు ఎన్టీఆర్‌ అని, ఆడపిల్లలకు ఆస్తిహక్కు, స్థానిక సంస్థల్లో మహిళలు, బడుగు, బలహీనవర్గాలకు రిజర్వేషన్‌ కల్పించిన ఘనత ఆయనదేనన్నారు. ఎన్టీఆర్‌ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ పాటుపడాలన్నారు. అనంతరం టీడీపీ మండల బాధ్యులు అద్దంకి నాగేశ్వరరావుచే ఎన్టీఆర్‌ శతజయంతి కేకు కట్చేయించి అందరికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు తులసి, సున్నం సునీత, నాయకులు వెంకటేశ్వర్లు, తన్నీరు పుల్లయ్య, తాటి రాజమ్మ, కనకం వెంకటేశ్వర్లు, గంగిశెట్టి సత్యనారాయణ, నరుకుళ్ల రంగారావు, మిరియాల శంకర్రావు, ఎర్రగొర్ల వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు. పాల్గొన్నారు.
కరకగూడెం : మండల కేంద్రంలో ఆదివారం ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. టీడీపీ మండల అధ్యక్షుడు సీరిశెట్టి కమలాకర్‌, మండల యాత్‌ ఆధ్వర్యంలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా కమలాకర్‌ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ వ్యక్తి కాదని.. ఓ శక్తి అని అన్నారు. తెలుగువాడి సత్తా ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన మహౌన్నత వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కలవలనాగారం టిడిపి ఉపసర్పంచ్‌ గుండ్ల సంతోష్‌, మండల నాయకులు తరసింగ్‌, అవుదొడ్డి శ్రీను, విసం సత్యనారాయణ, యువత కళ్యాణ్‌, బూరుగడ్డ రవి, సిరిశెట్టి సాయితేజ, శ్రీకాంత్‌, సాగర్‌, ప్రణరు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-08 12:46):

what is B9v a normal reading for blood sugar levels | blood sugar 2 hr after Qua eating a meal | azU fasting blood sugar level 67 | milk thistle effect on MLt blood sugar | can lact aid affect Jku blood sugar levels | blood sugar level 4Pb to trigger peripheral neuropathy | blood sugar levels exhaustion FY0 | how to prevent low blood vcq sugar when dieting | best thing to do when blood UaL sugar drops | magnesium supplements and blood Qgg sugar | does bupropion lower X4J blood sugar | can low ifD blood sugar trigger a stroke | blood sugar monitor 8GA at walmart | low blood PE4 sugar gluten free diet | how soon after eating does your blood sugar go up PO5 | blood sugar xAb is 130 after eating | fast ways xF5 to reduce blood sugar level | 6 weeks pregnant high blood 1t3 sugar | does high blood sugar give fjb you a headache | my blood sugar sQe keeps going up | is AXD 4 blood sugar low | quaker 8gt oats increase blood sugar levels | low blood WEu sugar vasodilator | what is the best time to take fasting blood pQ9 sugar | lentils help blood sugar 1W6 | can grapefruit RnK raise your blood sugar | arE does grape juice increase blood sugar | VBl symptoms of high blood sugar gestational diabetes | blood sugar maintenance 0kU medicine | diabetes blood sugar level 28D diagnosis | blood sugar 128 1 hour vQ7 after eating | what foods cause blood sugar 2dT to be high | what happens 28c to diabetics blood sugar after they eat | how can i lower blood sugar from 126 OD9 fasting | do bOt diuretics raise or lower your blood sugar | what giG raises blood sugar besides diabetes | what can cause Pgk high blood sugar | diabetes high fasting 7pg blood sugar | vitamin d raise hr6 blood sugar | essential oils that G7n regulate blood sugar | does wine increase your U7C blood sugar levels | nlz healthy diabetic blood sugar range | best meter to check blood 0Hp sugar | formula for yJe a1c to blood sugar | HwY why after blood sugar drops i get tired | diabetic chart for blood HYi sugar | when A7Y to check blood sugar after eating glucose tablets | blood sugar balance para que SRh sirve | why does blood dsB sugar keep going low | high blood sugar QAs during extended fast