పాలక పక్షమా.. ప్రతి పక్షమా!

– పార్లమెంట్‌లో బీజేపీ వింత ధోరణి
– యూకేలో రాహుల్‌ ప్రసంగమే సాకు
– క్షమాపణలకు అధికార పార్టీ డిమాండ్‌

– నిరసనలు, నినాదాలతో ప్రతిపక్షంపై ఎదురుదాడి
– అదానీ, ఇతర సమస్యలను పక్కదారి పట్టించే వ్యూహం : రాజకీయ విశ్లేషకులుదేశంలో అదానీ అంశం మొదలుకుని అధిక ధరల వరకు.. భారత్‌ అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. వీటిపై పార్లమెంటులో ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నది. అయితే, మోడీ సర్కారు మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తమ బాధ్యతను విస్మరిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలకపక్షమే ప్రతిపక్షంగా మారి ఎదురుదాడికి దిగుతున్నదని అంటున్నారు.
న్యూఢిల్లీ
: పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షం గొంతును మోడీ సర్కారు ఉద్దే శపూర్వకంగా అణచివేస్తోంది. ప్రతిపక్ష నాయకుల గొంతు బయటి ప్రపంచానికి వినిపించకుండా చేస్తున్నది. ఇందుకు యూకేలో రాహుల్‌ గాంధీ చేసిన ప్రసంగాన్ని సాకుగా వాడుకుంటున్నది. రాహుల్‌ క్షమాపణలు చెప్పాలని రభస సృష్టిస్తున్నది. పార్లమెంటులో చోటు చేసుకుంటున్న ఘటనలపై రాజకీయ విశ్లేషకులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదానీ విషయంలో మోడీ సర్కారుపై వస్తున్న ఆరోపణలు, దేశం ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై కేంద్రం వద్ద సరైన సమాధానాలు లేవనీ.. అందుకే ఇలాంటి కుయుక్తులకు మోడీ సర్కారు దిగుతున్నదని అభిప్రాయపడుతున్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్‌లోని పార్లమెంటులో ఇలాంటి అంతరాయాలు చాలా అరుదు. సాధారణంగా ప్రతిపక్షాల డిమాండ్‌లతో సభలకు అంతరాయం కలగటం సర్వసాధారణం. కానీ, పాలకపక్షమే సభను ముందుకు సాగనీయకపోవడం శోఛనీయమనీ, ఇలా చేస్తే ప్రజాస్వామ్యానికి అర్థమేమున్నదని వారు ప్రశ్నిస్తున్నారు. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నదనీ, పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుల మైకులను కట్‌ చేశారని యూకేలో చేసిన ఆరోపణలపై రాహుల్‌ క్షమాపణలు చెప్పాలని అధికార పార్టీ డిమాండ్‌ చేస్తున్నది. అంతటితో ఆగకుండా రాహుల్‌ను సభ నుంచి సస్పెండ్‌ చేయాలని బీజేపీ ఎంపీలు కోరడం గమనార్హం. అయితే, విదేశీ గడ్డపై భారత్‌కు సంబంధించిన వ్యవహారాల గురించి మోడీ కూడా అనేక సందర్భాలలో ప్రస్తావించిన ఘటనలు ఉన్నాయనీ, ఈ విషయాన్ని బీజేపీ నాయకుల మరిచిపోకూడదని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఆత్మరక్షణ కోసం పార్లమెంటులో ఇలాంటి స్వల్పకాలిక రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తూ బీజేపీ ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నదని ఆరోపిస్తున్నారు. పార్లమెంటును ఎలాంటి ఆటంకం కలిగించకుండా నడపాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నదనీ, అయితే సభ నడవకపోవడంపై ప్రభుత్వం ఏ మాత్రమూ ఆందోళన చెందినట్టుగా కనిపించడం లేదని చెప్తున్నారు. పార్లమెంటులో సమస్యలు చర్చకు రాకపోవడం ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పును కలిగిస్తుందనీ, ఈ విధానం వ్యక్తిత్వ, బ్రాండ్‌ రాజకీయాల పెరుగుదలను ప్రేరేపిస్తున్నదని విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా నిరక్షరాస్యులైన ఓటర్లు భావోద్వేగ అంశాలకు ఆకర్షితులవుతూ ఓటు వేస్తున్నారన్నారు. హిందూత్వ, పాక్‌ చైనా దేశాలను శత్రువులుగా చిత్రీకరిస్తూ భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా ఇలాంటి ఓటర్లను బీజేపీ తన వైపు తిప్పుకుంటున్నదనీ, ఇలాంటి విధానం దీర్ఘ కాలంలో దేశానికి అనేక నష్టాలను తెచ్చిపెడుతుందని ఆందోళన చెందుతున్నారు. కాబట్టి, దేశం ఎదుర్కొంటున్న అసలైన సమస్యలు పార్లమెంటులో చర్చకు రావాలనీ, ప్రతిపక్షాలకు తగిన విలువ దక్కినపుడే అది సాధ్యమవుతుందని రాజకీయ విశ్లేషకులు, నిపుణులు సూచిస్తున్నారు.

Spread the love
Latest updates news (2024-07-26 21:02):

hemoglobin a1c lp0 compared to blood sugar table | blood sugar yeast pu9 infection | low blood sugar h0n symtomps | what type of cinnamon is best for lowering Gs6 blood sugar | blood sugar 2 hrs JMK after lunch | does vitamin d v9p lower blood sugar levels | diabetes low blood sugar and yHM vomiting | can xTj losartan raise your blood sugar | what can i drink kwQ to bring down my blood sugar | what causes low blood z1X sugar in adults without diabetes | blood sugar 2xQ level 230 mg dl | can novacaine raise your blood sugar zVq | blood sugar vision X5q changes | does eating chicken increase x4r blood sugar | can ranitidine increase lqi blood sugar | check blood sugar other than finger ODw | low carb diet for YNY high blood sugar | coreg does it affect blood sugar levels 1Oe | what should be normal blood sugar after DqT eating | OFR foods to eat before bed for low blood sugar | high blood sugar 5ej early sign of pregnancy | how apple cider vinegar helps mjX blood sugar | HMA chromium blood sugar levels | how does a watch monitor blood S23 sugar | normal blood sugar Pwg levels for 19 year old | low fat sRe low carb diet high blood sugar | non diabetic blood sugar 2 hours after eating 1fh | pp MYn blood sugar normal | blood sugar for 11 year HPj old | does low 2Hz blood sugar make you vomit | 17V a good way to raise blood sugar | what ccv is blood sugar profile test | blood sugar high 40T level | blood sugar level strips S0h | whats a good bRh blood sugar in the afternoon | what happens if you have very 3Tx high untreated blood sugar | does vitamin SKO b12 increase blood sugar | does vfv albuterol increase blood sugar | blood sugar best medicine PDO | can heartburn MQc raise blood sugar | low blood sugar me ODF kya khana chahiye | d6D 13 hours fasting blood sugar | when 9FV is blood sugar level dangerously high | kXA can i smoke before blood sugar test | does apple cider vinegar help with lowering qED blood sugar levels | low blood sugar during pregnancy without diabetes Ad4 | what dF2 is the a1c equivalent to blood sugar | how pjg do you lower blood sugar levels fast naturally | fasting blood sugar gum C8J | will ice cream raise blood sugar OoW