పాప్ సింగర్ మడోన్నాకు తీవ్ర అస్వస్థత…

నవతెలంగాణ – అమెరికన్
అమెరికన్ స్టార్‌ పాప్ సింగర్ మడోన్నా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ వార్త విని మడోన్నా ఫ్యాన్స్​తో పాటు.. సంగీత ప్రపంచం ఆందోళనకు గురైంది. ఆమె తీవ్రమైన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఐసీయూలోనే తన మేనేజర్‌ వెల్లడించారు. బాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ నుంచి మడోన్నా కోలుకున్నా…ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాల్సిన అవసరం ఉందని మేనేజర్‌ గై ఓసీరీ వివరించారు. జూన్ 24 శనివారం మడోన్నాను న్యూయార్క్‌లోని ఆస్పత్రిలో చేర్పించామని చెప్పారు. క్రమంగా మడోన్నా ఆరోగ్యం మెరుగుపడుతోందని.. ఆమె పూర్తిగా కోలుకునే వరకూ వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని డాక్టర్లు సూచించారని తెలిపారు. మడోన్నా ఆరోగ్యం బాగాలేకపోవడంతో.. ప్రపంచ యాత్రతో పాటు అన్ని టూర్లను కమిట్‌మెంట్‌లను తాత్కాలికంగా రద్దు చేశామని మడోన్నా మేనేజర్‌ వెల్లడించారు. టూర్‌ కోసం కొత్త ప్రారంభ తేదీని, రీ షెడ్యూల్‌ చేసిన షో తేదీలను త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు. మడోన్నా అనారోగ్యం గురించి తెలుసుకున్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ ఫేవరెట్ సింగర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

Spread the love