రైతు దంపతుల విగ్రహలకు వినతిపత్ర అందజేత..

-19వ రోజు కొనసాగిన కార్మికుల నిరవధిక సమ్మె
నవతెలంగాణ -బెజ్జంకి
తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండల కేంద్రంలోని వ్యవసాయాధికారి కార్యలయం వద్ద రైతు దంపతుల విగ్రహాలకు పంచాయతీ కార్మికులు వినతిపత్ర అందజేశారు. సోమవారం మండలంలోని అయా గ్రామాల పంచాయతీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె 19వ రోజు కొనసాగింది.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం, పల్లెప్రగతి కార్యక్రమాలతో పాటు గ్రామాల పరిశుభ్రతకు పంచాయతీ కార్మికులు చేసిన సేవలను ప్రభుత్వం విస్మరించిదని కార్మికులు అవేదన వ్యక్తం చేశారు. కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని తెలిపారు.

Spread the love