భారీ వర్షాలకు పొంగిన వాగులు, వంకలు

నవతెలంగాణ-పరిగి
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. రోడ్లపై నీరు వచ్చి చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎడతెరిపి లేకుండా వర్షం భారీగా కురవడంతో ప్రజలు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. మండల పరిధిలోని పలు వాగులు పొంగిపోయాయి. దీనితో చెరువుల్లోకి నీరు వచ్చి చేరింది. పరిగి సమీపంలో ఉన్న వాగు పొంగడంతో బ్రిడ్జీ మీద నుండి నీళ్లు ప్రవహించాయి. దీనితో పరిగి నుండి వికారాబాద్‌కు వెళ్లే రాకపోవులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 2 గంటలసేపు ఎక్కడి వాహనాలక్కడే నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో పంట చేనుల్లోకి నీరు చేరడంతో పంటలు మునిగిపోయాయి.