‘సాహితీ కిరణం’ కవితల పోటీ

సాహితీ కిరణం, కొసరాజు ఆర్తి అండ్‌ జాహ్నవి మెమోరియల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అనాధ బాలల అవస్థలు అనే అంశంపై కవితల పోటీ నిర్వహిస్తోంది. ప్రథమ, ద్వితీయ బహుమతులుగా రూ.3000/-, రూ.2000/-లతో పాటు 5 సమాన బహుమతు లుగా ఒక్కొక్క కవితకు రూ.1000 /- అందివ్వనున్నారు. ఆసక్తి కలిగిన వారు జూన్‌ 30 లోగా ఎడిటర్‌, సాహితీ కిరణం, ఇంటి నెంబర్‌ 11-13-154, రోడ్‌ నెంబర్‌ 3, అలకాపురి, హైదరాబాద్‌ 500 102 చిరునామాకు పంపవచ్చు. వివరాలకు 9490751681 నంబరు నందు సంప్రదించవచ్చు.