రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన సమంత

నవతెలంగాణ – హైదరాబాద్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్న సమంత తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకున్నారు. రాష్ట్రపతితో కలిసి సమంత దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి సెర్బియాలో పర్యటించారు. సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం సమంత కూడా సెర్బియాలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సమంత రాష్ట్రపతిని కలిసినట్లు తెలుస్తోంది. సిటాడెల్ సినిమా యూనిట్ తో కలిసి వెళ్లి ద్రౌపది ముర్మును కలిసినట్లు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ట్వీట్ చేశారు. గౌరవనీయులైన భారత రాష్ట్రపతిని కలిసే అవకాశం కలిగింది. సెర్బియాలో ద్రౌపది ముర్ము మేడంను కలిశాం.. మిమ్మల్ని కలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అంటూ వరుణ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ ఫొటోలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, వరుణ్ ధావన్, సమంత ఉన్నారు. బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా మారుతున్న సమంత.. ఇప్పటికే ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో నటించింది. ఇప్పుడు వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ అనే సిరీస్ లో నటిస్తోంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ వెబ్ సిరీస్ భారతీయ వెర్షన్ దాదాపుగా పూర్తయినట్లు సమాచారం.

Spread the love