బల్కంపేట  యల్లమ్మ, పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు

– తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త దంపతులు
నవ తెలంగాణ – నాగోల్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని, బల్కంపేట, శ్రీ యల్లమ్మ పోచమ్మ దేవస్థానంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాసగుప్త  సతీ సమేతంగా అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్  ముఖ్యమంత్రి అయిన తరువాత దేవాలయాల అభివృద్ధి జరిగింది.  తెలంగాణ లోని  దేవాలయాలను  తీర్చిదిద్దడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. సమైక్య పాలనలో ఆదరణ లేక ప్రాభవాన్ని కోల్పోయిన దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు స్వరాష్ట్రంలో పునర్వైభవం సంతరించుకుంటున్నాయి. అని ఆయన అన్నారు.  కేసీఆర్‌ సర్కారు కృషితో వైభవోపేతంగా ఓ వెలుగు వెలుగుతున్నాయి అని ఆయన అన్నారు. ప్రజల్లోనూ ఆధ్యాత్మికత వెల్లివిరిస్తున్నది అని అన్నారు. తెలంగాణ చారిత్రక ప్రతిపత్తికి, ఆధ్యాత్మిక ఔన్నత్యానికీ పూర్వ వైభవం తేవడం కోసం మన తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది అని తెలంగాణ రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా కార్యాచరణను అమలు చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు. చిన్న గుడి నుంచి పెద్ద ఆలయాల వరకు ధూపదీప నైవేద్యం కోసం ప్రభుత్వం ఖర్చులు చెల్లిస్తుంది,1400 కోట్లతో  భూలోక వైకుంఠం యాదగిరి దివ్యక్షేత్రం  అద్భుతమైన శిల్పకళతో యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణం,600 కోట్లతో కొండగట్టు అంజన్న దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది అని ఆయన వివరించారు. నూతనంగా దూప దీప నైవేద్య పథకం ద్వారా పేద బ్రహ్మనులకు, ఆలయ అర్చకులకు 6వేల నుండి 10వేల రూపాయాలు గౌరవ వేతనాన్ని పెంచుతూ సీఎం కేసీఆర్  నిర్ణయం తీసుకున్నారు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు నరేష్ గుప్త, దుర్గారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.