అదే.. పవర్‌స్టార్‌ గొప్పతనం

Priya Prakash Warrior పవన్‌ కళ్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కలయికలో పి.సముద్రఖని దర్శకత్వం వహించిన చిత్రం ‘బ్రో’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్‌ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్‌ అందిస్తున్నారు.
ఈ సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇందులో ముఖ్య పాత్ర పోషించిన ప్రియా ప్రకాష్‌ వారియర్‌ మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
‘కెరీర్‌ ప్రారంభంలోనే పవన్‌ కళ్యాణ్‌ లాంటి లెజెండరీ నటుడితో కలిసి నటించే అవకాశం రావడం ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఆయన కాంబినేషన్‌లో సన్నివేశాలు ఉండటం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన తన నటనతో మ్యాజిక్‌ చేస్తారు. సెట్‌కి వస్తే ఎంతో సెలైంట్‌గా, జెంటిల్‌గా ఉంటారు. అదే ఆయన గొప్పతనం. గత చిత్రాలతో పోలిస్తే ఇందులో కొత్తగా కనిపిస్తాను. ఇందులో నా పాత్ర పేరు వీణ. హోమ్లీ గర్ల్‌ లాంటి క్యారెక్టర్‌. మాతక ‘వినోదయ సిత్తం’తో పోలిస్తే ఇందులో చాలా మార్పులు చేశారు. అలాగే కొన్ని ఆసక్తికరమైన కొత్త సన్నివేశాలనూ చేర్చారు. దర్శకుడు సముద్రఖనికి ఏం కావాలో, నటీనటుల నుంచి ఏం రాబట్టుకోవాలో స్పష్టంగా తెలుసు. నాకు పవన్‌ కళ్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌, నాయిక కేతిక శర్మ కాంబినేషన్‌ లోనూ సన్నివేశాలు ఉన్నాయి. ఇదొక మంచి కుటుంబ కథా చిత్రం. మొదటిసారి పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ లాంటి పెద్ద బ్యానర్‌లో సినిమా చేశాను. చాలా బాగా చూసుకున్నారు’ అని తెలిపారు.

Spread the love