బ్రో..

పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌ నుంచి టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేసి మేకర్స్‌ సర్‌ప్రైజ్‌ చేశారు. తన మేనల్లుడు, హీరో సాయి ధరమ్‌ తేజ్‌తో కలిసి పవన్‌ కళ్యాణ్‌ మొదటిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్న చిత్రమిది. ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్‌తో కలిసి టి.జి. విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాత.పి.సముద్రఖని దర్శకుడు. దర్శకులు త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ అందిస్తున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ అందరి అంచనాలను రెట్టింపు చేసేలా ఉండటం విశేషం. ఈ సినిమాకి ‘బ్రో’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను పెట్టారు. బ్యాక్‌ గ్రౌండ్‌లో పరమేశ్వరుడి రూపం కనిపిస్తుండగా.. ‘కాలః త్రిగుణ సంశ్లేశం.. కాలః గమన సంకాశం.. కాలః వర్జయేత్‌ చారణం.. కాలః జన్మనాజాయతే జయం స్వయం శ్రియం ద్వయం.. బ్రో బ్రోదిన జన్మలేషం..’ అనే శ్లోకం వినిపిస్తుండగా.. మెడలో ఓం లాకెట్‌ ధరించి స్టైలిష్‌ గాడ్‌లా కనిపిస్తున్న పవన్‌కళ్యాణ్‌ రూపాన్ని పరిచయం చేసిన తీరు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. గీత రచయిత కళ్యాణ చక్రవర్తి సాహిత్యం అందించారు. అలాగే ఈ చిత్రాన్ని జులై 28న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ చిత్ర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దాదాపు చిత్రీకరణ పూర్తయింది. ఇంకా పది రోజుల షూటింగ్‌ మాత్రమే మిగిలి ఉంది. ఆ మిగిలిన భాగంతో పాటు ఇతర కార్యక్రమాలు కూడా త్వరగా పూర్తి చేసి.. ప్రేక్షకులను కొత్త అనుభూతిని పంచే అద్భుతమైన చిత్రాన్ని అందించాలని చిత్ర బృందం ఎంతో ఉత్సాహంగా ఉంది.

Spread the love