భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే 

నవతెలంగాణ- కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాలను అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. న్యాల్ కల్ రోడ్డు, రోటరీ నగర్, లలిత నగర్,భవాని నగర్,అయోధ్య నగర్,త్రివర్ణ గణేష్ కాలనీ లను పరిశీలించి స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ.. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండండి. వర్ష కాలం లో వరద నీటిని మళ్లించేందుకు 2 కోట్ల రూ.లతో స్టోర్ వాటర్ డ్రైనేజ్ ( STORM WATER DRAINAGE ) ని నిర్మించాము.వరద నీరు ఎక్కడ ఆగకుండా డ్రైనేజీలు,కల్వర్టు లు నిర్మించాము. వర్షం పడితే ఎల్లమ్మ గుట్ట రైల్వే కమాన్ వద్ద ట్రాఫిక్ సమస్య ఏర్పడేది. ట్రాఫిక్ సమస్య అధిగమించడానికి రైల్వే కమాన్ వద్ద ఆర్ యు బి నిర్మించాము. నిజామాబాద్ నగరం లోని ప్రతి డివిజన్ కి ( టి యు ఎఫ్ ఐ డి సి) TUFIDC ద్వారా 1 కోటి రూ.లు మంజూరు చేసాము.వర్ష కాలం ప్రారంభం లోనే అన్ని డ్రైనేజి లను డి-సిల్టేషన్ ప్రక్రియను పూర్తిచేశాము.
భారీ వర్షాల కారణంగా దెబ్బ తిన్న రోడ్లను త్వరలోనే మరమ్మతులు చేస్తాము.ముంపు ప్రాంతాల్లో నీటిని మళ్లించేందుకు కచ్ఛ నలాలూ తవ్వుతున్నాము. మున్సిపల్, రెవెన్యూ,పోలీస్ సిబ్బందిని సమన్వయం చేస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాము.వర్ష కాలం లో సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.విష కీటకాలు ఇండ్లలో కి వచ్చే ప్రమాదం ఉన్నందున వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసాము.ఈ విపత్కాలం లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నాము.లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసాము.పునరావాస కేంద్రాలలో భోజన వసతి మంచి నీటి వసతి కల్పించాము.వర్షం  వరద తగ్గు ముఖం పట్టే వరకు పునరావాస కేంద్ర లలో ఆశ్రయం పొందండి.ప్రజల సహయార్థం నగర పాలక సంస్థ కేంద్ర కార్యాలయంలో 24×7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాము.08462-221001 నంబర్ కాల్ చేసి సహాయం పొందండి. నగర ప్రజలకు సూచనలు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే పాటించాలని తెలియజేశారు.అవసరమైతేనె తప్ప ప్రజలు ఎవరు బయటకు రాకూడదు.దూర ప్రయాణాలను వర్షాలు తగ్గే వరకు వాయిదా వేసుకోండి.విద్యుత్ స్తంభాలు షాక్ కొట్టే అవకాశం ఉంది.కావున విద్యుత్ స్థంబాలకు దూరంగా ఉండండి.శిథిలా భవనాల్లో ఉంటే వెంటనే పునరావాస కేంద్రాలకు వెళ్ళండి. చెరువులు, కాలువలు,కుంటల వద్దకు చిన్న పిల్లలు వెళ్లకుండా చూడండి.వరద నీటి విష కీటకాలు వచ్చే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండండి.ఈ కార్యక్రమంలో నగర మేయర్  దండు నీతు కిరణ్ , కార్పొరేటర్లు పట్నం విక్రమ్ గౌడ్, సుక్క మధు,ధర్మపురి, బి ఆర్ ఎస్ నాయకులు యెనుగందుల మురళి, నరేందర్ గౌడ్,కంచర్ల సంతోష్, గారిపల్లి ప్రవీణ్, గాండ్ల లింగం, అనిల్ రావు, పుప్పాల రవి, చింతకాయల రాజు,న ర్సింగ్ మున్సిపల్ అధికారులు, సాగర్, మురళి, రషీద్ తదితరులు పాల్గొన్నారు.