
నవతెలంగాణ -చివ్వేంల: మినీ గురుకుల ఉద్యోగుల సమస్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు సోమయ్య డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కలెక్టరేట్ వద్ద మినీ గురుకుల ఉద్యోగుల ధర్నా కు హాజరై వారికి మద్దతు తెలిపి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా కోశాధికారి వెంకటయ్య, జిల్లా శాఖ కార్యదర్శి బండి పాపిరెడ్డి, జిల్లా శాఖ సోషల్ మీడియా కన్వీనర్, చివ్వేంల మండల శాఖ అధ్యక్షులు దురుసోజు శ్రీనివాసచారి, ప్రధాన కార్యదర్శి సైదా నాయక్, ఉపాధ్యక్షులు మునుగోటి యాదయ్య, గురుకుల ఉద్యోగులు లక్ష్మి, పద్మ, ప్రతిభ, ఉమ, శ్రీలత, శ్రీనివాస్, సుజాత తదితరులు పాల్గొన్నారు.