బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ముగ్గురు మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బంగాల్లోని తూర్పు మేదినీపుర్ సహర గ్రామపంచాయితీ పరిధిలోని ఖాదికుల్ గ్రామంలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఎగ్రా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. పేలుడు మంగళవారం మధ్యాహ్నం జరిగింది. పేలుడు శబ్దం విన్న గ్రామస్థులు ఒక్కసారిగా ఘటనాస్థలికి భారీగా చేరుకున్నారు.

Spread the love