ఎన్నికలలో ప్రజా సమస్యల్ని పరిష్కరించే వారికి ఓటు వేయాలి

– సీపీఎం డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్
నవతెలంగాణ- ఆర్మూర్:
ఎన్నికల్లో ప్రజా సమస్యలను పరిష్కరించే వారికి ఓటు వేయాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ అన్నారు. పట్టణంలోని శాస్త్రి నగర్ సీపీఎం కార్యాలయం యందు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగణ రాష్ట్రం లో అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 30 న జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో హామీలు కాకుండా పని చేసే వారికి ఓటు వేయాలని సీపీఎం ప్రజలకు పిలుపు ఎవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రం లో సీపీఎం పార్టీ 17 స్థానంలో పోటీ చేస్తుంది అన్నారు. ఎర్ర జెండా పేదల సమస్యల పై అసెంబ్లీ లో కోల్డదనికి పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. అసెంబ్లీ కి ఎర్ర జెండా సీపీఎం కు ఓటు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి కుతాడి ఎల్లయ్య, డివిజన్ కమిటి సభ్యులు టీ బూమన్న, B రవి, సిద్దల్ నాగరాజ్, కుల్దిపు శర్మ నవీద్ తదితరులు పాల్గొన్నారు.