సోదరి తల తెగనరికి చేతిలో పట్టుకుని తిరిగాడు..

నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌లో అతి దారుణమైన సంఘటన జరిగింది. ఓ వ్యక్తితో సంబంధం పెట్టుకుని లేచిపోయిందనే కోపంతో ఓ యువకుడు తన సోదరి తల తెగనరికి.. ఆ తలను చేతిలో పట్టుకుని తిరిగాడు. యూపీలోని బారాబంకీ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బారాబంకీ జిల్లాకు చెందిన ఓ యువతి.. తన సామాజిక వర్గం కాని వ్యక్తితో సంభందం పెట్టుకుంది. ఈ విషయంలో గొడవలు జరగడంతో అతనితో కలిసి లేచిపోయింది. దాంతో ఆగ్రహించిన ఆమె సోదరుడు రియాజ్‌ (24) ఆ యువతిని వెతికిపట్టుకుని దారుణంగా హత్యచేశాడు. మొండెం నుంచి తలను వేరు చేయగడమేగాక.. ఆ తలను చేతిలో పట్టుకుని వీధుల్లో తిరిగాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు రియాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కులంకానీ వ్యక్తితో లేచిపోయినందుకే తాను ఈ ఘాతుకానికి ఒడిగట్టానని పోలీసుల ప్రాథమిక విచారణలో రియాజ్‌ తెలిపాడు.