ఓబీసీ కమిషన్‌ చైర్మన్‌కు ఆరె సంక్షేమ సంఘం ధన్యవాదాలు

హైదరాబాద్‌: ఓబీసీ కమిషన్‌ గతంలో తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి ఆరె కులంతో పాటు మరికొన్ని కులాలను ఓబీసీ జాబితాలో చేర్చేందుకు ఆమోదించటంపై ఆరె సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఓబీసీ కమిషన్‌ చైర్మెన్‌కు ధన్యవాదాలు తెలిపింది. దేశంలోని ఆరు రాష్ట్రాల నుంచి మొత్తం 80 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత కుల సంఘాలు ఓబీసీ కమిషన్‌కు గతంలో పలుమార్లు విజ్ఞప్తి చేశారు.
కాగా ఈ విజ్ఞప్తులను ఎన్సీబీసీ పరిశీలిస్తుందని దాదాపు ఆయా కులాలన్నిటిని ఓబీసీ జాబితాలో చేర్చడానికి త్వరలోనే క్యాబినెట్‌కు సిఫారసు చేస్తామని ఓబీసీ కమిషన్‌ చైర్‌ పర్సన్‌ హాన్స్‌ రాజ్‌ గంగారాం ఆహిర్‌ వెల్లడించడం ఆనందదాయకమని ఆరె సంక్షేమ సంఘం తెలిపింది.

Spread the love