ఎన్నికల నిర్వహణ కోసం పకడ్బందీ నిఘా ఏర్పాట్లు

యం. మను చౌదరి, ఐఏఎస్ జుక్కల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎన్నికల అధికారి. 
నవతెలంగాణ- మద్నూర్ :
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా సోమవారం జుక్కల్ నియోజకవర్గం ఎన్నికల ఏర్పాట్లను ఎన్నికల అధికారి ఎం. మను  చౌదరి ఐఏఎస్  మద్నూర్ మండల కేంద్రంలో స్ట్రాంగ్ రూముల ఏర్పాటు,  నామినేషన్ ప్రక్రియ, వివిధ ఏర్పాట్ల గురించి పరిశీలించి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం  మీడియా సమావేశంలో మాట్లాడుతూ మద్నూరు మండల కేంద్రంలోని బాలుర ప్రభుత్వ పాఠశాలలో స్ట్రాంగ్ రూం ల ఏర్పాటు పై గదులను పరిశీలించారు.  అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్ పరిసరాల్లో పకడ్బందీ నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు  తెలిపారు.  వీటితో పాటు అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్లు,  జిల్లాల చెక్ పోస్ట్లు లలో నిఘా విభాగం తో పాటు వీడియో రికార్డింగ్, సీ సీ కెమెరాల ద్వారా నిఘా పెట్టినట్లు తెలిపారు.
ఇప్పటికే ప్లైన్ స్క్వాడ్ల, ఎస్ ఎస్ టి, వి ఎస్ టి, తదితర బృందాలను నియమించినట్లు తెలిపారు.  తాసిల్దార్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో మరియు నిఘా బృందాల అధికారులతో సమీక్ష సమావేశం అవగాహన సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు ఆన్లైన్లో కూడా నామినేషన్ వేసే విధానాన్ని ఈ సంవత్సరం కొత్తగా తీసుకొచ్చినట్లు తెలియజేశారు.  ఎన్ కోర్, సువిధ అనే ఆన్లైన్ సైట్ల ద్వారా రాజకీయ పార్టీల ప్రచారాలు, వివిధ అనుమతుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించారు.  ప్రచారానికి సంబంధించి  అనుమతులు పొందాలంటే 48 గంటల ముందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో మద్నూర్ మండల తాసిల్దార్ ముజీబ్, డిప్యూటీ తాసిల్దార్ భరత్, గిర్ధవర్ శంకర్, సీనియర్ అసిస్టెంట్ విజయ్, సిబ్బంది ముస్తఫా తదితర అధికారులు పాల్గొన్నారు.
Spread the love