ఎనిమిదేళ్లలో మూడు రెట్లయిన శాఖలు

– బంధన్‌ బ్యాంక్‌ వెల్లడి
హైదరాబాద్‌: ప్రయివేటు రంగంలోని బంధన బ్యాంక్‌ గడిచిన ఎనిమి దేళ్లలో తమ శాఖల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని వెల్లడించింది. ప్రస్తు తం 1500 పైగా శాఖలకు విస్తరించినట్లు పేర్కొంది. మరో 4,500 బ్యాం కింగ్‌ యూనిట్ల నెట్‌వర్క్‌తో, మొత్తం బ్యాంకింగ్‌ అవుట్‌లెట్‌ల సంఖ్య 6,000 ను అధిగమించినట్లు తెలిపింది. 2015 ఆగస్టులో 501 శాఖలతో తన ప్రయాణాన్ని ప్రారంభించినట్లు పేర్కొంది. ప్రస్తుతం 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తమ కార్యకలాపాలను విస్తరించామని బంధన్‌ బ్యాంక్‌ ఎండి, సిఇఒ చంద్ర శేఖర్‌ ఘోష్‌ తెలిపారు.

Spread the love