ఉత్తర కాలిఫోర్నియాలో భూకంపం

నవతెలంగాణ – కాలిఫోర్నియా: ఉత్తర కాలిఫోర్నియాలో భూకంపం సంభవించింది. ఉత్తర కాలిఫోర్నియాలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రతతో ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదని కాలిఫోర్నియా అధికారులు చెప్పారు. ఈ భూకంపం 10 కిలోమీటర్లు లోతులో సంభవించింది. గ్రామీణ హంబోల్ట్ కౌంటీ పెట్రోలియాకు పశ్చిమాన 108 కిలోమీటర్లు దూరంలో భూకంపం వచ్చింది. కాలిఫోర్నియాలో గత సంవత్సరం డిసెంబరులో కూడా రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో 12 మంది గాయపడ్డారు. ఫ్రాన్స్‌లోని న్యూ కలెడోనియాలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించడంతో దక్షిణ పసిఫిక్‌లో సునామీ హెచ్చరిక జారీ చేశారు. ఉత్తర కాలిఫోర్నియాలోని తక్కువ జనాభా ఉన్న ప్రాంతంలో వచ్చిన భూకంపం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదు. కాలిఫోర్నియాలో భూకంపాలు తరచూ వస్తుంటాయని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

Spread the love