పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు సహకరించాలి….

– కౌన్సిలర్ అన్నంరాజు సుమిత్ర సురేష్
నవతెలంగాణ – మేడ్చల్
పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు సహకరించాలని 20 వ వార్డు కౌన్సిలర్ అన్నంరాజు సుమిత్ర సురేష్ అన్నారు. గురువారం మున్సిపల్ పరిధిలోని 20 వార్డు లో మేర లైఫ్ మేర స్వచ్ఛ శహార్ లో భాగంగా పనికిరాని వస్తువులను సేకరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఇంట్లో పనికిరాని వస్తువులను ఎక్కడ పడితే వేయకుండా ఆర్ ఆర్ ఆర్ సెంటర్ లోఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకుడు కౌకుంట్ల కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Spread the love