భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజల అప్రమత్తంగా ఉండాలి

– జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
– అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లవద్దు
– వాగులు, వంకల వద్ద వరద ప్రవాహం అధికంగా ఉన్న దృష్ట్యా వాటి వద్దకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళవద్దు.
– రైతులు పొలాల్లో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తగా ఉండాలి,వర్షాలు పడేటప్పుడు విద్యుత్ స్తంభాలను గాని,వైర్లను గానీ చేతులతో తాకవద్దు.
– వర్షంలో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు రోడ్లపై నీరు ప్రవహించే చోట అప్రమత్తంగా ఉండాలి
– లెవెల్ వంతెనల వద్ద అప్రమత్తంగా ఉండాలి
– వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి విజ్ఞప్తి.
– భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ శాఖల అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్.
నవతెలంగాణ- సిరిసిల్ల
జిల్లాలో నిరంతరం కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్లవద్దని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. శుక్రవారం  జిల్లాలో కురుస్తున్న  భారీ వర్షాల నేపథ్యంలో ఉదయం అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను, మున్సిపల్ కమిషనర్ లను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ…మానేరు, మూలవాగు పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండలని జలాశయాలు, చెరువులు, వాగుల ,ప్రాజెక్టు ల వద్దకు ఎవరు వెల్లద్దు అని అదేవిధంగా మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లకూడదని అన్నారు. గ్రామాలలో పాత ఇండ్లు, గుడిశ లలో,శిథిలావస్థలో ఉండే నివాసలలో ఉండే  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కూలిపోయే పరిస్థితిలో ఉంటే వెంటనే రెవెన్యూ  అధికారులకు సమాచారం అందిస్తే సురక్షిత ప్రదేశాలకు తరలిస్తామని అన్నారు. ఇప్పటికే ప్రమాదకరంగా వరద నీరు ప్రవహిస్తున్న లో లెవెల్ వంతెనలు ఉన్న వాగుల వద్ద బారి కేడ్లు ఏర్పాటు చేశామన్నారు. ల్లాలో ఎక్కడైనా రోడ్ల పై వరద ఉదృతితో రోడ్లు తెగిపోయినా, ఉదృతంగా ప్రవహించినా అక్కడికి ఆ గ్రామ ప్రజలు వెళ్లకుండా, ప్రజలు వెంటనే స్థానిక రెవెన్యూ, పోలీస్ అధికారులకు సమాచారం అందించాలన్నారు. భారీ వర్షం మరియు బలమైన గాలుల సమయంలో విద్యుత్ తీగలు,స్తంబాలు మరియు ట్రాన్స్ఫార్మర్లకు  దూరంగా ఉండాలన్నారు. అలాగే తడి చేతులతో స్విచ్ బోర్డులు ముట్టకోవద్దు అని సూచించారు. ప్రజలందరూ ఈ వర్షా కాలంలో  జిల్లా యంత్రాంగం సూచనలు, సలహాలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ వరదల పట్ల అప్రమత్తంగా ఉంటూ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు. భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. 24×7 గంటలు ఈ కంట్రోల్ రూం పని.చేస్తుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం,  సమాచారం అందించేందుకు ప్రజలు కంట్రోల్ రూం నెంబర్  9398684240 సంప్రదించాలన్నారు. అధికారులు అందుబాటులో ఉండాలి.
జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో  ఎలాంటి ప్రాణ, ఆస్తి, జంతు నష్టం వాటిల్లకుండా ఎప్పటికప్పుడు జిల్లా , క్షేత్ర అధికారులు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.  పరిస్థితి మెరుగు పడేవరకు చెరువుల, వాగుల వద్ద చేపలు పట్టడానికి, స్నానాలకు అనుమతించవద్దని కలెక్టర్ ఆదేశించారు. వర్షాలు ముగిసే వరకూ స్థానికంగానే అందుబాటులో టు వర్ష పరిస్థితిని కనిపెట్టుకొని ఉండాలన్నారు. కాచి వడబోసిన నీటినే త్రాగాలి వర్షాల నేపథ్యంలో ప్రజలు కాచి వడపోసిన నీటిని తాగాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు సూచించారు. తద్వారా ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుందన్నారు.