చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు..

నవతెలంగాణ- హైద‌రాబాద్‌: మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు నాయుడుకు  ఆదాయ‌ప‌న్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ కంపెనీల నుంచి చంద్ర‌బాబు నాయుడుకు సుమారు 118 కోట్లు ముడుపుల రూపంలో ముట్టిన‌ట్లు ఐటీ శాఖ ఆరోపించింది. చ‌ట్టం ప్ర‌కారం ఆ సొమ్ము అప్ర‌క‌టిత ఆదాయంగా పేర్కొన్న‌ది. బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా చంద్రబాబు ముడుపులు పొందినట్లు ఆదాయ పన్ను శాఖ అధికారులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఈ కేసులో చంద్రబాబు అభ్యంతరాలను తిరస్కరించిన తర్వాత.. ఆగష్టు 4వ తేదీనే హైదరాబాద్‌ ఐటీ సెంట్రల్‌ సర్కిల్‌ కార్యాలయం సెక్షన్ 153C కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Spread the love