వృద్దాశ్రమంలో ‘కేటీఆర్ బర్త్ డే’..

– అన్నదానం
నవతెలంగాణ-మంగపేట : బీఆర్ఎస్ కార్యనిర్వాహక అద్యక్షుడు ఐటీ, పురపాలకశాఖా మంత్రి కేటీఆర్ బర్త్ డేను మండల కేంద్రంలోని కస్తూరిబాయి వృద్ధాశ్రమంలో మండల పార్టీ అద్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. బర్త్ డే కార్యక్రమానికి సొసైటీ చైర్మన్ తోట రమేష్ ముఖ్య అతిధిగా హాజరై కేటీఆర్ బర్త్ డే కేక్ ను పార్టీ అద్యక్షుడు లక్ష్మీనారాయణతో కలిసి వృద్దుల సమక్షంలో కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వృద్ధాశ్రమలోని వృద్దులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బాడిశ నాగ రమేష్, వైస్ చైర్మన్ కాడబోయిన నరేందర్, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, సొసైటీ డైరెక్టర్లు నర్రా శ్రీధర్, సిద్ధంశెట్టి లక్ష్మణరావు, మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ చిలకమర్రి రాజేందర్, జిల్లా జీవ వైవిద్య డైరెక్టర్ కర్రీ శ్యాంబాబు, మండల ఆర్గనైజేషన్ సెక్రెటరీ చల్లగురుగుల తిరుపతి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మోదుగు బాబు, బీసీ సెల్ మండల అధ్యక్షుడు శానం నరేందర్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు తోలేం నర్సింహారావు, మహిళలు నాయకలు కాటూరి సుగుణ, పద్మ, తిరుపతమ్మ, ఝాన్సీ, యూత్ నాయకులు గుమ్మల వీరస్వామి, నిమ్మగడ్డ ప్రవీణ్, గోపాల్, రమేష్, పిల్లలమర్రి వేణు, బోడ శ్రీను, సుంకోజు ప్రశాంత్, బోడ ప్రసాద్, జానపట్ల విష్ణులు పాల్గొన్నారు.

Spread the love