విపక్షాల నిరసనతో మధ్యాహ్నానికి వాయిదాపడ్డ లోక్ సభ

నవతెలంగాణ – హైదరాబాద్
మణిపూర్ అల్లర్ల అంశం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తోంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. బుధవారం లోక్ సభ ప్రారంభం కాగానే మణిపూర్ అల్లర్లు, ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లును వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో గందర గోళ పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభ లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మణిపూర్ అంశంపై చర్చకు విపక్ష నేతలు పట్టుపడుతున్నారు. ప్రధాని మోదీ రాజ్యసభకు వచ్చి మణిపూర్ అంశంపై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ప్రధానికి ఆదేశాలు జారీచేయాలని డిమాండ్ చేశాయి. అయితే, వారి డిమాండ్ ను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖర్ తిరస్కరించారు. దీంతో వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విపక్షాల నిరసనల మధ్యే ఎగువ సభ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

Spread the love