నయా పాలి’ట్రి’క్స్‌

– ఎన్నికలంటే డబ్బే..
– రొక్కమున్నోడే అభ్యర్థి
– నిధులున్నోడిదే రాజకీయం
– టిక్కెట్‌ నుంచి పోలింగ్‌ దాకా
– కాసుల వర్షం..ఓట్లకు గాలం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాజకీయాలకు అర్థం మారుతున్నది. ప్రజాస్వామ్యం అటకెక్కింది. రాజ్యాంగం అపహాస్యం పాలవుతున్నది. ఎన్నికలంటే ఫక్తు డబ్బే అనేలా సీన్‌ తయారైంది. రాష్ట్రంలో జరుగుతున్న తాజా అసెంబ్లీ ఎన్నికలు ఇందుకు నిదర్శనం. పోలింగ్‌కు మరో 14 రోజులే ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయం ఊసరవెల్లిని తలపిస్తున్నది. కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్నారు. గెలుపే ధ్యేయంగా పావులు కదులుతున్నాయి. విలువలకు వలువల్లేకుండా పోతున్నాయి. సాధారణ ప్రజల ఓట్ల పేర కొంటున్నారు. ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు ఎన్నికలు. అలాంటి ఎన్నికలకు ఇప్పుడు డబ్బే ఇంధనం. టిక్కెట్‌ ఖరారు నుంచి పోలింగ్‌ దాకా ప్రతి సందర్భంలోనూ డబ్బు లేకుండా పనికాదు. లేకపోతే ఎన్నికల బండి కదలదు. డబ్బున్నోడే అభ్యర్థి అవుతున్నాడు. నిధులున్నోడిదే రాజకీ యం అవుతున్నది. రాజకీయం వ్యాపారమైంది. పెట్టుబడికి ఒక అవకాశంగా మారుతున్నది. రొక్కమున్నోళ్లే అభ్యర్థులవుతున్నారు. కాసు లున్నోళ్లే జాబితాల్లో చోటుచేసుకుంటున్నారు. ఆయా పార్టీల క్యాడర్‌ను సంతృప్తి పరచడానికి అడ్డంగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తు న్నారు. జనం కోసమంటూ అక్రమాలకు పాల్ప డుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 119 నియోజవర్గాల్లో 2219 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాజకీయ పార్టీలు కాసుల్లేకుండా ఎన్నికల బండిని నడిపే పరిస్థితి లేదు. ప్రధానంగా బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ రోక్కం చేతపట్టుకుని ఓటర్లతో కబడ్డీ ఆడుతు న్నాయి. ఆ గట్టునుంటావా ? ఈ గట్టుకొస్తావా ? అంటూ ఆశ పెడుతున్నాయి. రంగుల లోకంలో విహరింపచేస్తున్నాయి. మద్యం మత్తు లో ముంచుతున్నాయి. మొత్తానికి అత్యంత ఖరీదైనవగా మారిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దేశాన్ని ఆకర్షిస్తున్నాయి. నాడు హుజురాబాద్‌, దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లో కోట్లకు కోట్లు ఎడాపెడా ఖర్చు పెట్టారు. ఢిల్లీ నిర్వాచన్‌సదన్‌ ఎన్నికల కోసం ఎన్ని నిబంధనలు పెట్టినా, మరెన్నో మార్గద ర్శకాలు విడుదల చేసినా పట్టించుకునేవారే లేరు. ఎజెన్సీలు ఎన్ని ఉన్నా కండ్లకు గంతలు కట్టుకున్నట్టే. అక్కడ ఒక్కో ఓటుకు రూ. ఆరు వేల చొప్పున ఇచ్చిన విషయం ఇంకా మరిచి పోలేదు. రూ. 1000 నుంచి రూ. 1500 కోట్లు ఖర్చుపెట్టినట్టు వివరించారు . 2019లో లోక్‌సభతోపాటు ఆయా రాష్ట్రాలో ్లజరిగిన అసెంబ్లీ ఎన్నికలకు రూ 55 వేల కోట్ల నుంచి రూ. 60 వేల కోట్ల వరకు ఖర్చయినట్టు సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ అనే సంస్థ ప్రకటించింది. 1998 నుంచి 2019 మధ్య ఎన్నికల వ్యయం ఆరు రెట్లు పెరిగినట్టు ఆ సంస్థే ప్రకటించింది. నామినేషన్‌ వేసిన దగ్గర నుంచి ఫలితాల వరకు పక్కాగా లెక్కలు చెప్పాలని ఎన్నికల కమిషన్‌ చెబుతున్నా, చెవికెక్కించుకున్నవారేవరు? రకరకాల మార్గాల్లో డబ్బు చేతులు మారుతోంది. కాలంతోపాటు ఎన్నికల ప్రాధాన్యత మారుతూ వస్తున్నది. అర్హతలతో పని లేకుండా పోయింది. ఎన్నికల ప్రక్రియ అవినీతి మకిలమైంది. ప్రజాస్వామ్యం ధనస్వామ్యవు తున్నది.ఎమ్మెల్యేకు కనీసం రూ. 50కోట్లు, ఎంపీ కి రూ. 100కోట్లు లేకపోతే ఎన్నికల్లో నిలబడే పరిస్థితి లేదు. ఓటును సరుకుగా మార్చేశారు. అమ్మడం, కొనడమనే పద్ధతే అంతటా అమల వుతున్నది. డబ్బులేని వారు ఎన్నికల్లో పోటీకి అనర్హులనే భావన దాపురించిందని అసోసియే షన్‌ ఆఫ్‌ డెమెక్రటిక్‌ రిఫార్మ్స్‌్‌(ఏడీఆర్‌) అనే సంస్థ వ్యాఖ్యానించింది. ఓటు వజ్రాయుధం అనేది నేడు కేవలం ఒక కోటేషన్‌గా మారి పోవడం దురదృష్టకరం.

Spread the love
Latest updates news (2024-07-22 21:49):

anxiety buy legal herb | zyplex supplement genuine | cvs sex products cbd vape | rogentra male K0K enhancement pills review | cialis viagra cbd cream and | male enhancement and sGC performance supplement | does Jin cialis affect blood pressure | what is the most popular drug of all jYf time | little blue cbd oil capsule | free shipping viagra efeitos | what was viagra first 9Tc used for | penis online sale enlargement poland | does q7V levothyroxine cause erectile dysfunction | safe erectile dysfunction viy pills | how to get horny x4A male | viagra big sale young man | best price LQi cialis canada | best sexual experiences online shop | bull blood male enhancing pills 6VF facebook | can leukemia PRo cause erectile dysfunction | man over market low price | men weight lBM loss pills | most effective viagra token | erectile dysfunction after knee replacement p5c surgery | can cold cause c7T erectile dysfunction | natural enhancement for male Evr libido | gorilla pills iN9 male enhancement | erectile dysfunction age Kjr 60 | what cSO makes your penis grow | rda for rFp male enhancement panex ginseng | best pills to increase female pVX libido | can you get d19 male enhancement pills at walmart | pomegranate online shop juice viagra | hydromax testimonials genuine | strong medicine for erectile dysfunction Lsr | anxiety don bigg | big sale biaxin pill | how to add inches 6SD to your dick | can pregnancy cause 0pD erectile dysfunction | gnc t online sale | erectile dysfunction statistics united states 6gL | what is he getting emails F9r about male enhancement | does agent aMM orange anddiabeted type 2 cause erectile dysfunction | in cbd vape store viagra | what is qIq like viagra | anxiety kava at cvs | best viagra india 190 quora | free trial evoxa pills | what will 4Ub make your dick bigger | t strong testosterone booster aUv reviews