రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యునిగా రత్నాకర్

నవ తెలంగాణ – సిద్దిపేట
రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యునిగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ చేతులమీదుగా నియామక పత్రం అందుకున్నట్లు అయిత రత్నాకర్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. మంగళవారం హైదరాబాద్ చింతల్ బస్తి లోని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో నియామక పత్రం అందుకున్నానని, నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్శి గంప శ్రీనివాస్, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యవర్గానికి, సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ, మహిళా విభాగం, యువజన విభాగం, సేవాదళ్ విభాగం కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. తాను స్వీకరించిన పదవికి న్యాయం చేస్తానని, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అభివృద్ధికి, మహాసభ సభ్యత్వాన్ని పెంపొందించుటకు, వైశ్యుల ఐక్యతకు కృషి చేస్తానని తెలిపారు.

Spread the love