ఎంసెట్లో సత్తా చాటిన అన్నదమ్ముల కొడుకులు

నవతెలంగాణ – ఆర్మూర్
వారిద్దరి కుటుంబాలు మధ్యతరగతివి. ఎంసెట్లో సత్తా చాటారు అన్నదమ్ములు.. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లికి చెందిన భూమేని రవి, మాధవి ల కుమారుడు పవన్ ఎంసెట్లో 1204 సైన్స్ లో ర్యాంకు సాధించారు. ఒకటి నుండి పదవ తరగతి వరకు ఆర్మూర్లో చదివి ఇంటర్మీడియట్ హైదరాబాదులో బిపిసి లో 9 7 3 మార్కులు సాధించి, నీట్ లో మంచిర్యాంకు సాధించి ఎంబిబిఎస్ చేయాలనుకుంటున్నాడు. విద్యార్థి తండ్రి చిరు వ్యాపారి కాగా, తల్లి గృహిణి… మామిడిపల్లికి చెందిన భూ మేని రాజేందర్, లావణ్య ల కుమారుడు హర్షిత్ ఎంసెట్లో17,558 ర్యాంకు సాధించారు. యూకేజీ ఫస్ట్ క్లాస్ స్కాలర్ మోడల్ స్కూల్, రెండు నుండి 5వ తరగతి వరకు సెంట్ ఆన్స్ స్కూల్, ఆరు నుండి పదవ తరగతి వరకు మోడల్ స్కూల్, ఇంటర్మీడియట్ పట్టణంలోని క్షత్రియ జూనియర్ కళాశాలలో చదివినాడు. ఇంటర్ మార్క్స్ 952బై 1000 సాధించినాడు. ఈయన తండ్రి చిరు వ్యాపారి కాగా తల్లి గృహిణి. ఈ విద్యార్థుల తండ్రులు పెద్దనాన్న, చిన్న నాన్న కొడుకులు కావడం కొసమెరుపు..