తాడ్వాయి మండలాన్ని ములుగు రెవెన్యూ డివిజన్లో కలపాలి

– నవచైతన్య యూత్ రాష్ట్ర అధ్యక్షులు గడ్డం రాజ్ కుమార్
 నవతెలంగాణ- తాడ్వాయి 
పరిపాలన సౌలభ్యం దృష్ట్యా తాడ్వాయి మండలాన్ని ములుగు రెవెన్యూ డివిజన్లో కలపాలని బుధవారం నవ చైతన్య యూత్ రాష్ట్ర అధ్యక్షులు రాజకుమార్ స్థానిక తహసిల్దారు తోట రవీందర్ కు వినతి పత్రం అందించి మాట్లాడారు. తాడ్వాయి మండలాని ములుగు జిల్లాలోని అన్ని సౌకర్యాలు ఉంటాయి కనుక తాడ్వాయి మండలాన్ని ములుగు రెవిన్యూ డివిజన్ లో ఉంచాలని డిమాండ్ చేశారు. తాడ్వాయి మండల ప్రజలకు, ఆర్డీవో, జిల్లా కలెక్టర్ గారితో ఏమైనా పని ఉంటే మనం మొదటగా ఏటూర్ నాగారం ఆర్డిఓ గారిని కలిసి, మళ్లీ ములుగు తిరిగి వెళ్లాల్సి వస్తుందని అదే, ములుగు రెవెన్యూ డివిజన్ అయితే అక్కడే RDO గారిని కలుస్తాము సమస్య పరిష్కరించ పడకపోతే  కలెక్టర్ గారితో పని చేసుకోవడానికి వీలుగా సులభంగా వెళ్లిన రోజే పని పూర్తి అయ్యేవిధంగా ఉంటుందని తెలిపారు. మిగతా 5 మండలాలకు ఏటూర్ నాగారం కేంద్రంగా ఉంటుంది. కాబట్టి అక్కడి ప్రజలకు RDO ఆఫీసులో పని కాని యెడల ములుగు వెళ్లడం వల్ల వాళ్లకు ఏమీ సమస్య ఉండదు. కానీ మన తాడ్వాయి మండల ప్రజలు ఏటూర్ నాగారం వెళ్లి అక్కడ కానీ ఎడల మళ్లీ వెనక్కి ములుగు కు తిరిగి రావాల్సి వస్తుంది. మన తాడ్వాయి మండలంలోని దూర ప్రాంత గ్రామాలైన కాల్వపల్లి నార్లాపూర్, బయ్యక్కపేట, వెంగలాపూర్, లింగాల, బంధాల, కొడిశల గ్రామాల ప్రజలు ఏ అవసరానికైనా పసరకి, ములుగుకి వెళ్తాము. రంగాపూర్ బీరెల్లి, కాటాపూర్ దామరవాయి వంటి గ్రామ ప్రజల పరిస్థితి వాళ్లకు జరగబోయే సమస్య అంతా ఇంతా కాదు వాళ్లకు అక్కడ  ఆఫీస్ లో పని కాకపోతే తిరిగి మళ్ళీ ములుగుకు వెళ్లాలంటే ఆ రోజు ఇంటికి వచ్చి మరుసటిరోజు ములుగుకు వెళ్ళాలి. అంటే ఒక రోజులో మన సమస్య పరిష్కరించబడదు. అంటే ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ అయితే మన మండల ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. ములుగు రెవెన్యూ డివిజన్ లో ఉంచాలని డిమాండ్ చేశారు.మండలంలోని ప్రజలం కొంత సమయాన్ని వెచ్చించి పోస్టల్ కార్డు ద్వారా అదేవిధంగా గ్రామసభ తీర్మానాల ద్వారా, ప్రతికల, సంఘాలు వారి వారి కుల సంఘ తీర్మానాల ద్వారా, వివిధ రాజకీయ పార్టీలు  తమ తమ లెటర్ ప్యాడ్ ద్వారా కలెక్టరేట్ గారికి విన్నవించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీరెల్లి పిఎసిఎస్ డైరెక్టర్ లింగ చారి, కాయితి కృష్ణ చారి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Spread the love