గుడిలోకి దూసుకెళ్లిన లారీ..డ్రైవర్ సహా ముగ్గురి దుర్మరణం

నవతెలంగాణ – హైదరాబాద్: కినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తొండంగి మండలం ఎ.కొత్తపల్లి వద్ద ఆదివారం ఓ గ్రావల్ లారీ గుడిలోకి దూసుకెళ్లిపోయింది. అన్నవరం నుంచి ఒంటిమామిడి వైపు వెళుతున్న లారీ తొలుత ఎ.కొత్తపల్లిలో రోడ్డు పక్కనే ఉన్న తాగునీటి ట్యాంకును ఢీకొట్టింది. ఆ తరువాత పక్కనే ఉన్న గుడిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ చుక్కల శేఖర్, క్లీనర్ నాగేంద్రతో పాటూ గుడిలో నిద్రిస్తున్న సోము లక్ష్మణరావు అక్కడిక్కడే మృతి చెందారు.

Spread the love