నవతెలంగాణ-హైదరాబాద్ : లైంగికదాడి చేసేందుకు యత్నించిన యువకుడి మర్మాంగాన్ని ఓ మహిళ కోసేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో కౌశాంబి జిల్లాలో జరిగింది. బాధిత మహిళ భర్త సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడు. ఆమె వద్ద పనిచేస్తున్న ఓ యువకుడు.. మంగళవారం మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో ఆమెపై లైంగికదాడి చేసేందుకు యత్నించాడు. అతడిని మాటల్లో పెట్టిన ఆ మహిళ వంటగదిలోకి వెళ్లి కత్తి తెచ్చుకుని ఒక్కసారిగా నిందితుడి జననాంగాన్ని కోసేసింది. దానిని ఓ సంచిలో తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఘటనాస్థలి నుంచి తప్పించుకున్న యువకుడు కుటుంబసభ్యుల సహాయంతో ప్రయివేటు ఆస్పత్రిలో చేరాడు. తన నోట్లో వస్త్రం కుక్కి ఆమె తన ప్రయివేటు భాగాన్ని కోసేసిందని తెలిపాడు. లైంగికదాడి ఆరోపణలను యువకుడు ఖండించాడు. ఇరువైపుల ఫిర్యాదులు అందుకున్న పోలీసులు.. మహిళను అదుపులోకి తీసుకున్నారు. కత్తిని స్వాధీనం చేసుకున్నారు.