నవతెలంగాణ -నకిరేకల్: నకిరేకల్ కాంగ్రెస్ అభ్యర్ధి వేముల వీరేశం వివాదంలో చిక్కుకున్నారు. బీర్ బాటిల్స్ మీద స్టిక్కర్స్ వేసి నకిరేకల్ కాంగ్రెస్ అభ్యర్ధి వేముల వీరేశం వెరైటీ ప్రచారం చేస్తున్నారు. నకిరేకల్ నియోజక వర్గంలో అన్ని గ్రామాల్లో బీర్ బాటిల్స్ మీద స్టిక్కర్స్ వేసి.. ఓటర్లకు పంచుతున్నారట. ఈ సంఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.