లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబరాక్‌, సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

నవతెలంగాణ-ఓయూ
కల్యాణలక్ష్మి, షాదీముబరాక్‌, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కలను డిప్యూటీ స్పీకర్‌ తీగుల్ల పద్మారావు గౌడ్‌ శుక్రవారం సితాఫల్‌మండీలోని క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ మాట్లాడుతూ సికింద్రాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో పేద, మధ్య తరగతి ప్రజలు అధికంగా ఉన్నారనీ, వారి సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు. దళారీల ప్రమేయాన్ని నివారించేందుకు నేరుగా ప్రజలతో తాము సాన్నిహిత్యాన్ని ఏర్పరుచుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ పథకాల్లో ఎవరు డబ్బులు అడిగినా సీతాఫల్‌మండిలోని తమ క్యాంపు కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. బౌద్దనగర్‌ డివిజన్‌కు చెందిన లబ్దిదారులకు 25 చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ యువ నేత కిషోర్‌ కుమార్‌, సీనియర్‌ నాయకులు కంది నారాయణ, బీజంకి రాజేష్‌, పాక సాయి, మహిళ నాయకులు, జలంధర్‌ రెడ్డి, రాజ సుందర్‌, అధికారులు పాల్గొన్నారు.

Spread the love