స్టాఫ్‌ నర్స్‌ నుంచి నర్సింగ్‌ ఆఫీసర్‌గా పేరు మార్చాలి

– ఉస్మానియా హాస్పిటల్‌ నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ సుజాత రాథోడ్‌
ఆస్పత్రిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్‌

ప్రభుత్వం స్టాఫ్‌ నర్స్‌ నుంచి నర్సింగ్‌ ఆఫీసర్‌గా పేరు మార్చాలని ఉస్మానియా హాస్పిటల్‌ నర్సింగ్‌ సూపరింటెం డెంట్‌ సుజాత రాథోడ్‌ అన్నారు. శుక్రవారం ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ 203 జన్మదినం సందర్భంగా ఉస్మానియా హాస్పి టల్‌లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం కార్యక్రమం నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి హాస్పిటల్‌ సూపరింటెండెం ట్‌ డాక్టర్‌ నాగేందర్‌, నర్సింగ్‌ సూపర్డెంట్‌ సుజాత రాథోడ్‌ హాజరై కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుజాత రాథోడ్‌ మాట్లాడుతూ రోగుల పట్ల ప్రేమతో సేవలందించిన ప్లోరెన్స్‌ నైటింగేల్‌ కీర్తి నేటికీ సజీ వంగా ఉందనీ, ఆమె బాటలో నర్సింగ్‌ వృత్తిని ఎంచుకున్న వారు పయనించాలని కోరారు. ప్రభుత్వం స్టాఫ్‌ నర్స్‌ నుం చి నర్సింగ్‌ ఆఫీసర్‌గా పేరు మార్చాలని విజ్ఞప్తి చేశారు. గతంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు నర్సింగ్‌ డైరెక్టరేటు ను ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారనీ, వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. నర్సింగ్‌ రిక్రూమెంట్‌ ను వెంటనే చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెడ్‌ నర్సులు జయమ్మ, శిరీష, రాణి, కపవరం, మేరీ, సద్గుణ, స్టాప్‌ నర్సులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love