శాంతి భద్రతలకు ప్రభుత్వం పెద్దపీట ఎమ్మెల్యే గుర్క జైపాల్‌ యాదవ్‌

– ఆమనగల్‌, కడ్తాల్‌ మండల కేంద్రాల్లో ఘనంగా పోలీస్‌ సురక్ష దినోత్సవం
నవతెలంగాణ-ఆమనగల్‌
శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కల్వకుర్తి శాసన సభ్యులు గుర్క జైపాల్‌ యాదవ్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఆమనగల్‌, కడ్తాల్‌ మండల కేంద్రాల్లో పోలీస్‌ సురక్ష దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కడ్తాల్‌ మండల కేంద్రంలో ఎస్‌ఐ హరిశంకర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ఎంబీఏ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ హాజరై మాట్లాడారు. ఫ్రెండ్లీ పోలీస్‌, షీటీం, సీసీ కెమెరాలతో పాటు వివిధ రూపాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో భాగంగా పోలీసులను ఎమ్మెల్యే పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్‌ నాయక్‌, ఎంపీపీ కమ్లి మోత్యా నాయక్‌, డీసీసీబీ డైరెక్టర్‌ గంప వెంకటేష్‌ గుప్తా, వైస్‌ ఎంపీపీ ఆనంద్‌, ఏఎస్‌ఐ సీతారాంరెడ్డి, సర్పంచులు గూడూరు లక్ష్మీ నరసింహ రెడ్డి, భారతమ్మ నర్సింహ గౌడ్‌, ఎంపీటీసీ సభ్యులు లచ్ఛిరామ్‌ నాయక్‌, మంజుల చంద్రమౌళి, నాయకులు జోగు వీరయ్య, కంబాలపల్లి పరమేష్‌, ఎర్రోళ్ల రాఘవేందర్‌, చందోజీ, జహంగీర్‌ అలి, సిద్దిగారి దాసు పాల్గొన్నారు. అదేవిధంగా ఆమనగల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ఎస్‌ఐ సుందరయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా సీఐ జాల ఉపేందర్‌ హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ అనిత విజరు, ఏఎంసీ చైర్మెన్‌ నాలాపురం శ్రీనివాస్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ జక్కు అనంత్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్మెన్‌ రాంపాల్‌ నాయక్‌, వైస్‌ చైర్మెన్‌ భీమనపల్లి దుర్గయ్య, జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు డాక్టర్‌ పత్య నాయక్‌, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షులు నిట్ట నారాయణ, సర్పంచ్లు వడ్త్యావత్‌ సోనా శ్రీను నాయక్‌, లక్ష్మణ్‌ నాయక్‌, ఎంపీటీసీ సభ్యులు దోనాదుల కుమార్‌, ఏఎంసీ డైరెక్టర్‌ రమేష్‌ నాయక్‌, నాయకులు తల్లోజు రామకృష్ణ, గుమ్మకొండ రాజు, రూపం వెంకట్‌ రెడ్డి, ఖాదర్‌ ఖాద్రీ, సయ్యద్‌ ఖలీల్‌, చుక్క నిరంజన్‌ గౌడ్‌, వడ్డె వెంకటేష్‌, విఠాయిపల్లి రమేష్‌, శివకుమార్‌, అల్లాజీ, కృష్ణ నాయక్‌, సురేష్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love