క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ

నవతెలంగాణ – హైదరాబాద్
పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో మరో ఘనతను సాధించాడు. గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ 61 బంతుల్లో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ సీజన్ లో కోహ్లీకి ఇది వరుసగా రెండో సెంచరీ. ఈ క్రమంలో వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. అత్యధిక సెంచరీలను సాధించిన బ్యాట్స్ మెన్ గా అవతరించాడు. ఐపీఎల్ లో గేల్ 6 శతకాలను సాధించగా… కోహ్లీ 7 సెంచరీలతో గేల్ ను అధిగమించాడు. హాఫ్ సెంచరీలలో కూడా ఐపీఎల్ రికార్డు కోహ్లీ పేరిటే ఉంది. ఇప్పటి వరకు కోహ్లీ 50 హాఫ్ సెంచరీలను నమోదు చేయగా… 31 అర్ధ శతకాలతో గేల్ రెండో స్థానంలో ఉన్నాడు. మరోవైపు, కోహ్లీ మునుపటి ఫామ్ ను సాధించాడని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Spread the love